ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్యాండ్‌, బాజా, బరాత్‌..!

ABN, Publish Date - Nov 10 , 2024 | 01:54 AM

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. దేశంలోని వ్యాపారాలకూ ఈ సీజన్‌ మరింత జోష్‌ ఇస్తోంది. ఈ నవంబరు-డిసెంబరు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నట్టు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది....

  • డిసెంబరులోగా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం

  • వచ్చే యాభై రోజుల్లో 35 లక్షల పెళ్లిళ్లు

  • సీఏఐటీ, ప్రభుదాస్‌ లీలాధర్‌ నివేదిక వెల్లడి

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. దేశంలోని వ్యాపారాలకూ ఈ సీజన్‌ మరింత జోష్‌ ఇస్తోంది. ఈ నవంబరు-డిసెంబరు మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నట్టు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది మూడు లక్షలు ఎక్కువ. ఈ బ్యాండ్‌ బాజాల కోసం వధూవరుల తల్లిదండ్రులు ఎంత లేదన్నా ఈ రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని ప్రభుదాస్‌ లీలాదర్‌ అనే బ్రోకరేజీ సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించి ‘బ్యాండ్‌, బాజా, బరాత్‌ అండ్‌ మార్కెట్స్‌’ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది.


ఏటా రూ.10.96 లక్షల కోట్ల ఖర్చు

మన దేశంలో ఏటా దాదాపు కోటి జంటలు వివాహ బంధంతో ఒకటవుతుంటాయి. ఈ సంఖ్య ఏటా 7 నుంచి 8 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో పెళ్లిళ్ల ఖర్చులు ఏటా ఎంత లేదన్నా 13,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.10.96 లక్షల కోట్లు) వరకు ఉంటాయని అంచనా. టర్నోవర్‌పరంగా చెప్పాలంటే వెడ్డింగ్‌ పరిశ్రమ మన దేశంలో నాలుగో పెద్ద పరిశ్రమ. ఈ ఏడాది జనవరి 15 నుంచి జూలై 15 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల పెళ్లిళ్లు నమోదయ్యాయి. ఇందుకోసం వధూవరుల తల్లిదండ్రులు రూ.5.5 లక్షల కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని సీఏఐటీ అంచనా. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో పసిడిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఖర్చులు మరింత పెరిగాయి.


డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు గిరాకీ

గతంలో పెళ్లిళ్లు అన్నీ వధూవరుల ఇంట్లో లేదా దగ్గరలోని కల్యాణ మండపాల్లో జరిగేవి. ఇప్పుడు ఈ ట్రెండ్‌ మారిపోతోంది. ఆర్థిక స్థోమతను బట్టి రాజస్థాన్‌ లేదా గోవా ఇందుకు వేదికలవుతున్నాయి. సెలబ్రైటీలైతే విదేశాల్లో తమ పిల్లల పెళ్లిళ్లు ధూమ్‌ధామ్‌గా చేస్తున్నారు. దీంతో కనీసం పిల్లల పెళ్లిళ్లు అయినా మన దేశంలో చేయండని ప్రధాని మోదీ ఇటీవల సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. మరోవైపు ఈ మధ్య కాలంలో వెడ్డింగ్‌ ప్లానర్లకూ గిరాకీ పెరిగింది. బంధుమిత్రులకు టిక్కెట్ల బుకింగ్‌, విడిది సదుపాయల నుంచి కల్యాణ మండపాల అలంకరణ, వధూవరుల మేకప్‌ వరకు అన్నీ వీరే చూసుకుంటారు.


స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం

దసరా, దీపావళి వంటి పండగల సీజన్‌తో పాటు పెళ్లిళ్ల సీజన్‌లో మన దేశంలో వినియోగం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో రిటైల్‌, ఆతిథ్య రంగం, ఆటోమొబైల్‌ కంపెనీలు మరింత బిజినెస్‌ చేస్తుంటాయి. ఈ ప్రభావం స్టాక్‌ మార్కెట్‌నూ ప్రభావితం చేస్తుంది. మెట్రో సిటీల్లో వినియోగం తగ్గడంతో అనేక ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. కనీసం ఈ పెళ్లిళ్ల సీజన్‌ అయినా కలిసొస్తుందని ఈ కంపెనీలు గంపెడాశలు పెట్టుకున్నాయి.


ఫ్రెషర్స్‌ నైపుణ్యాలపై జీసీసీల దృష్టి

గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాలు (జీసీసీ) నియామకాల జోరు పెంచాయి.ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ),మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డేటా సైన్స్‌పై పట్టున్న ఫ్రెషర్ల కోసం ఈ కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ రంగాలపై పట్టున్న ఫ్రెషర్లు దొరికితే ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీల కంటే అధిక జీతాలు ఇచ్చి మరీ ఆఫర్‌ లెటర్లు ఇస్తున్నాయి. ఈ ప్యాకేజీ ఎంత లేదన్నా ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలతో పోలిస్తే 30ు వరకు ఎక్కువగా ఉన్నట్టు పరిశ్రమ వర్గా లు చెబుతున్నాయి. ఇలాంటి నైపుణ్యాల్లో విద్యార్ధులకు చక్కటి శిక్షణ ఇస్తున్న ఇంజనీరింగ్‌ కాలే జీలు, బిజినెస్‌ స్కూల్స్‌, జనరల్‌ డిగ్రీలు ఆఫర్‌ చేసే కాలేజీలకు జీసీసీలు క్యూ కడుతున్నాయి.

Updated Date - Nov 10 , 2024 | 01:54 AM