ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు ఏకంగా 16 సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..?

ABN, Publish Date - Jan 01 , 2024 | 01:45 PM

బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఈ జనవరి నెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు ఈ వార్తను కచ్చితంగా గమనించగలరు. ఈ నెలలో ఒకటి కాదు, రెండు కాదు బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులున్నాయి.

బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్. ఈ జనవరి నెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్న వాళ్లు ఈ వార్తను కచ్చితంగా గమనించగలరు. ఈ నెలలో ఒకటి కాదు, రెండు కాదు బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులున్నాయి. స్థానికంగా ఉండే పండుగులు, జాతీయ వేడుకలు, ఆదివారాలు, శనివారాలు కలుపుకుంటే మొత్తం 16 రోజులు బ్యాంకులు పని చేయవు. దీంతో బ్యాంకుకు వెళ్లానుకుంటున్నవాళ్లు ఈ విషయాన్ని గమనించి బ్యాంకులు పని చేసే రోజుల్లోనే వెళ్లడం మంచింది. బ్యాంకులు పని చేయపోయినప్పటికీ ఆన్‌లైన్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు, యూపీఐ ఆధారిత సేవలలు యథావిధిగా అందుబాటులో ఉండనున్నాయి. ఎక్కడి నుంచైనా సరే తమ మొబైల్ ఫోన్‌ల ద్వారానే ఈ సేవలను పొందొచ్చు. అయితే ఈ నెలలో బ్యాంకులకు సెలవులు ఉండే ఆ 16 రోజులు ఏవో ఒకసారి పరిశీలిద్దాం.


జనవరి 1, సోమవారం- నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జనవరి 1న దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులను సెలవు ప్రకటించారు.

జనవరి 2, మంగళవారం- మిజోరాంలో కొత్త సంవత్సర వేడులక కొనసాగింపు సందర్భంగా జనవరి 2న బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

జనవరి 11, గురువారం- మిషనరీ డే సందర్భంగా మిజోరాంలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు.

జనవరి 15, సోమవారం- ఈ రోజున అనేక రాష్ట్రాల్లో స్థానిక పండుగలు ఉన్నాయి. దీంతో ఆ రోజున బ్యాంకులు పనిచేయవు. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అస్సాం సహా పలు రాష్ట్రాల్లో జనవరి 15న ఉత్తరాయణ పుణ్యకాల, మకర సంక్రాంతి, మాఘే సంక్రాంతి, పొంగల్, మాఘ బిహు వంటి వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవు ఇచ్చారు.

జనవరి 16, మంగళవారం- తిరువల్లువర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 16న తమిళనాడులో బ్యాంకులు పని చేయవు. అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక రాష్ట్రాల్లో కూడా స్థానిక పండుగల కారణంగా బ్యాంకులు పని చేయవు.

జనవరి 17, బుధవారం- ఉజావర్ తిరునాల్, శ్రీగురు గోవింద్ సింగ్ జీ పుట్టిన రోజును పురస్కరించుకుని చండీగఢ్, తమిళనాడులో 17న బ్యాంకులు పనిచేయవు.

జనవరి 22, సోమవారం- ఇమోయిను ఇరట్‌పాను పురస్కరించుకుని జనవరి 22న మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు.

జనవరి 23, మంగళవారం- స్థానిక వేడుకల కారణంగా మణిపూర్‌లో జనవరి 23న బ్యాంకులకు సెలవు.

జనవరి 25, గురువారం- ఎండీ.హజరాత్ అలీ పుట్టినరోజును పురస్కరించుకుని తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 25న బ్యాంకులు పనిచేయవు.

జనవరి 26- త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ మినహా మిగతా రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు.

వీటికి తోడు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు అనే సంగతి తెలిసిందే. ఇలా ఈ నెలలో మొత్తం 16 రోజులు బ్యాంకులు పని చేయవు.

Updated Date - Jan 01 , 2024 | 01:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising