Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులివే.. ఎన్ని రోజులు పనిచేస్తాయంటే
ABN, Publish Date - Jun 01 , 2024 | 09:44 AM
జూన్ నెల(June 2024) రానే వచ్చింది. ఈ సందర్భంగా ఈ నెలలో బ్యాంకు సెలవులు(Bank holidays) ఎన్ని ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని కోసం బ్యాంకుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే జూన్ 2024 బ్యాంక్ సెలవుల గురించి తప్పనిసరిగా తెలుసుకుని వెళ్లండి.
జూన్ నెల(June 2024) రానే వచ్చింది. ఈ సందర్భంగా ఈ నెలలో బ్యాంకు సెలవులు(Bank holidays) ఎన్ని ఉన్నాయి. ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని కోసం బ్యాంకుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే జూన్ 2024 బ్యాంక్ సెలవుల గురించి తప్పనిసరిగా తెలుసుకుని వెళ్లండి.
లేదంటే బ్యాంక్ హాలిడే రోజు మీరు పనికోసం వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితా ప్రకారం జూన్‌లో దాదాపు 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే రోజుల్లో, ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయో వివరంగా తెలుసుకుందాం.
జూన్ 2024 బ్యాంకు సెలవుల జాబితా
జూన్ 1, 2024- ఈ రోజు ఎన్నికల ప్రదేశాలలో బ్యాంకులు మూసివేయబడతాయి
జూన్ 2, 2024- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 8, 2024- నెలలో రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
జూన్ 9, 2024- ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి
జూన్ 10, 2024 - శ్రీగురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్‌లో బ్యాంకులకు హాలిడే
జూన్ 14, 2024 - పహిలి రాజా కారణంగా ఒడిశాలో బ్యాంకులకు సెలవు
జూన్ 15, 2024 - ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో YMAడే, ఒడిశాలోని రాజా సంక్రాంతి కారణంగా బ్యాంకులకు సెలవు
జూన్ 16, 2024- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 17, 2024 - బక్రీద్ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
జూన్ 21, 2024 - వట్ సావిత్రి ఉపవాసం కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి
జూన్ 22, 2024- నెలలో నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
జూన్ 23, 2024- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
జూన్ 30, 2024- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఇది కూడా చదవండి:
LPG Gas: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News
Updated Date - Jun 01 , 2024 | 09:44 AM