November: నవంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..?
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:26 AM
నవంబర్ మాసం ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులకు ఉన్న సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసింది.
నవంబర్ మాసం ప్రారంభమైంది. ఆదివారంతోపాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులకు సెలవులే. ఇవి కాకుండా ఈ మాసంలో వచ్చే పండగలతోపాటు వివిధ సందర్భాల్లో బ్యాంకులకు సెలవులున్నాయి. అందుకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ముంబయిలో విడుదల చేసింది. ఈ మాసంలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవు ఉన్నాయని తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవులను ఈ సందర్భంగా ఆర్‌బీఐ వివరించింది.
నవంబర్ 1: దీపావళి సందర్భంగా త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌లోని బ్యాంకులకు సెలవు. ఇక కర్ణాటకలో నవంబర్ 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించింది.
నవంబర్ 2: దీపావళి, లక్ష్మీ, గోవర్ధన్ పూజల కారణంగా.. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఈ రోజు సెలవు దినంగా పేర్కొంది.
నవంబర్ 3: ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని బ్యాంకులు సైతం మూసి వేసి ఉంటాయన్న సంగతి తెలిసిందే.
నవంబర్ 7: చాత్ పండగ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 8: వంగల పండగ కారణంగా బిహార్, జార్ఖండ్, మేఘాలయ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 9: రెండో శనివారం
నవంబర్ 10: ఆదివారం
నవంబర్ 15: కార్తీక పౌర్ణమితోపాటు గురునానక్ జయంతి. దీంతో మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛండీగఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమబెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, శ్రీనగర్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 17: ఆదివారం
నవంబర్ 18: కనకాదాసు జయంతి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని అన్ని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 23: నాలుగో శనివారం. అదీకాక సెంగ్ కుట్స్నెమ్. దీంతో మేఘాలయాలోని అన్ని బ్యాంకులకు సెలవు.
నవంబర్ 24: ఆదివారం.
For National News And Telugu News
Updated Date - Nov 01 , 2024 | 11:26 AM