ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bank Holidays in September: సెప్టెంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. తేదీలివే

ABN, Publish Date - Sep 01 , 2024 | 11:43 AM

ప్రతి నెలలాగే సెప్టెంబర్‌లోనూ(Bank Holidays in September) బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ నెలలో ఏకంగా 15 రోజులు సెలవులు రావడం గమనార్హం.

హైదరాబాద్: ప్రతి నెలలాగే సెప్టెంబర్‌లోనూ(Bank Holidays in September) బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ నెలలో ఏకంగా 15 రోజులు సెలవులు రావడం గమనార్హం. ఇందులో ఆదివారాలు, రెండు, నాలుగో శనివారం హాలిడేలు ఉన్నాయి. వీటితోపాటు వివిధ పండుగలకుసైతం సెలవులున్నాయి.

సెప్టెంబర్‌లో బ్యాంక్ సెలవుల జాబితా

సెప్టెంబర్ 1 (ఆదివారం): అన్ని బ్యాంకులు మూసేసి ఉంటాయి.

సెప్టెంబర్ 4 (బుధవారం): శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి ఉండటంతో అస్సాంలో బ్యాంకులు బంద్

సెప్టెంబర్ 7 (శనివారం): తెలంగాణ , గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవాలలో గణేష్ చతుర్థి, సంవత్సరాది, ఇతర ప్రాంతీయ ఉత్సవాల సందర్భంగా బ్యాంకులు క్లోజ్

సెప్టెంబర్ 8 (ఆదివారం): అన్ని బ్యాంకులు మూసేసి ఉంటాయి.

సెప్టెంబర్ 14 (శనివారం): కేరళ, జార్ఖండ్‌లలో కర్మ పూజ, మొదటి ఓనమ్‌తో పాటు రెండో శనివారం కూడా కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసేసి ఉంటాయి.


సెప్టెంబర్ 15 (ఆదివారం): అన్ని బ్యాంకులు మూసేసి ఉంటాయి.

సెప్టెంబర్ 16 (సోమవారం): మిలాద్(అన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్) పండుగ ఉండటంతో గుజరాత్, మిజోరం, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, జమ్మూ, కేరళ, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్.

సెప్టెంబర్ 17 (మంగళవారం): ఇంద్రజత్రా, ఈద్-ఇ-మిలాద్ ఉండటంతో సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలో బ్యాంకులు మూసేసి ఉంటాయి.

సెప్టెంబర్ 18 (బుధవారం): పాంగ్-లాబ్సోల్ ఉండటంతో అస్సాంలోని బ్యాంకులు క్లోజ్.

సెప్టెంబర్ 20 (శుక్రవారం): ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ సందర్భంగా శుక్రవారం జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులు క్లోజ్.

సెప్టెంబర్ 21 (శనివారం): శ్రీనారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కేరళలో బ్యాంకులు మూతపడనున్నాయి.

సెప్టెంబర్ 22 (ఆదివారం): బ్యాంకులన్నీ బంద్


సెప్టెంబర్ 23 (సోమవారం): మహారాజా హరి సింగ్ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులు బంద్.

సెప్టెంబర్ 28 (శనివారం): నాలుగో శనివారం అన్ని బ్యాంకులకు సెలవు

సెప్టెంబర్ 29 (ఆదివారం): బ్యాంకులన్నీ బంద్

అయితే సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కస్టమర్‌లు తమ లావాదేవీలను జరుపుకోవచ్చు.

For Latest News click here

Updated Date - Sep 01 , 2024 | 11:55 AM

Advertising
Advertising