Bank lockers: బ్యాంక్ లాకర్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కట్టాల్సిన మొత్తం ఎంతంటే..
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:09 AM
మనకు సంబంధించిన నగలను, విలువైన పత్రాలను దాచుకునేందుకు బ్యాంకులు లాకర్ సదుపాయాన్ని అందిస్తాయి. వ్యక్తిగత కస్టమర్‌లు, భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ కంపెనీలు, క్లబ్‌లు మొదలైన వివిధ వర్గాల కస్టమర్‌లు బ్యాంక్ లాకర్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.
మనకు సంబంధించిన నగలను, విలువైన పత్రాలను దాచుకునేందుకు బ్యాంకులు లాకర్ (Bank Lockers) సదుపాయాన్ని అందిస్తాయి. వ్యక్తిగత కస్టమర్‌లు, భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ కంపెనీలు, క్లబ్‌లు మొదలైన వివిధ వర్గాల కస్టమర్‌లు బ్యాంక్ లాకర్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు. మైనర్లకు మాత్రమే బ్యాంక్ లాకర్ సదుపాయం అందుబాటులో ఉండదు. నిజానికి బ్యాంక్‌లు డబ్బు దాచుకునేటపుడు దాని భద్రతకు బ్యాంక్ పూర్తి బాధ్యత వహించదు. అయితే లాకర్ల విషయంలో మాత్రం బ్యాంక్ చాలా సురక్షితమైన హామీ ఇస్తుంది.
వార్షిక అద్దె ప్రాతిపదికన లాకర్ సేవలను అందిస్తూ, బ్యాంకులు తమ కస్టమర్లకు ఒక రకమైన లీజుదారుగా వ్యవహరిస్తాయి. కాగా, ఈ లాకర్ల మన దేశంలోని టాప్ బ్యాంక్‌లు నిబంధనలను మార్చాయి. ఈ నెల నుంచి అద్దె రుసుమును పెంచాయి. పలు బ్యాంక్ లాకర్లు అద్దెలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఎస్బీఐ (SBI) లాకర్ అద్దె
చిన్న లాకర్: రూ. 2,000 (మెట్రో/అర్బన్), రూ. 1,500 (సెమీ-అర్బన్/రూరల్)
మీడియం లాకర్: రూ. 4,000 (మెట్రో/అర్బన్), రూ. 3,000 (సెమీ-అర్బన్/రూరల్)
పెద్ద లాకర్: రూ. 8,000 (మెట్రో/అర్బన్), రూ. 6,000 (సెమీ-అర్బన్/రూరల్)
అదనపు పెద్ద లాకర్: రూ. 12,000 (మెట్రో/అర్బన్), రూ. 9,000 (సెమీ-అర్బన్/రూరల్)
ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ లాకర్ అద్దె
గ్రామీణ ప్రాంతాలు: రూ.1,200 నుంచి రూ.10,000
సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ. 2,000 నుంచి రూ. 15,000
పట్టణ ప్రాంతాలు: రూ. 3,000 నుంచి రూ. 16,000
మెట్రో: రూ.3,500 నుంచి రూ.20,000
మెట్రో+ స్థానం: రూ. 4,000 నుంచి రూ. 22,000
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ లాకర్ ఛార్జీలు
మెట్రో శాఖలు: రూ.1,350 నుంచి రూ.20,000
పట్టణ ప్రాంతాలు: రూ. 1,100 నుంచి రూ. 15,000
సెమీ అర్బన్ ప్రాంతాలు: రూ. 1,100 నుంచి రూ. 11,000
గ్రామీణ ప్రాంతాలు: రూ.550 నుంచి రూ.9,000
పీఎన్‌బీ (PNB) లాకర్ ఛార్జీలు
గ్రామీణ ప్రాంతాలు: రూ. 1,250 నుంచి రూ. 10,000
పట్టణ ప్రాంతాలు: రూ. 2,000 నుంచి రూ. 10,000
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 05 , 2024 | 11:26 AM