Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే
ABN, Publish Date - Oct 30 , 2024 | 07:58 AM
బ్యాంకులు ఏ రోజున మూసి ఉంటాయి, ఏ రోజున కార్యకలాపాలు కొనసాగిస్తాయనే స్పష్టత ఉంటే వినియోగదారులు తదనుగుణంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. జాతీయ, ప్రాంతీయ పండుగల కారణంగా నవంబర్ 2024లో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి.
సాధారణ పౌరులు, కంపెనీలు, ఇతర వర్గాలవారు బ్యాంకుల్లో ఎన్నో ముఖ్యమైన లావాదేవీలు నిర్వహిస్తుంటారు. కాబట్టి బ్యాంకులు ఏ రోజున మూసి ఉంటాయి, ఏ రోజున కార్యకలాపాలు కొనసాగిస్తాయనే స్పష్టత ఉంటే వినియోగదారులు తదనుగుణంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. జాతీయ, ప్రాంతీయ పండుగల కారణంగా నవంబర్ 2024లో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి.
మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని సేవలు బ్యాంకులోనే పొందాల్సి ఉంటుంది. అందుకే వినియోగదారులకు నిరంతరాయంగా సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నెలలవారీగా బ్యాంక్ హాలిడేస్‌ను వెల్లడించి అప్రమత్తం చేస్తుంటుంది. నవంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను కూడా వెల్లడించింది.
ముఖ్యమైన సెలవులు ఇవే..
దేశవ్యాప్తంగా చూస్తే నవంబర్ నెలలో దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇక ప్రాంతీయ పండగల కారణంగా మరికొన్ని రాష్ట్రాల్లో హాలిడేస్ ఉన్నాయి. ప్రాంతీయ సెలవులు వచ్చిన కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. దీపావళి సందర్బంగా నవంబర్ 1న ఉత్తర భారతంలోని రాష్ట్రాల బ్యాంకుల సెలవు ఉంటుంది. దక్షిణ భారత రాష్ట్రాల్లోని బ్యాంకులకు అక్టోబర్ 31నే దీపావళి సెలవు. ఇక నవంబర్ 3న ఆదివారం, నవంబర్ 9న రెండవ శనివారం, నవంబర్ 10న ఆదివారం, నవంబర్ 15న గురునానక్ జయంతి, నవంబర్ 17న ఆదివారం, నవంబర్ 23న నాలుగవ శనివారం, నవంబర్ 24న ఆదివారం.. ఈ రోజుల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు పెద్దగా సెలవులు లేవు. కానీ ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగల కారణంగా సెలవులు ఎక్కువగా వచ్చాయి. నవంబర్ 1న త్రిపుర, కర్ణాటకలలో, నవంబర్ 7, 8న ఛత్ పూజ సందర్భంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో, నవంబర్ 15న గురునానక్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో, నవంబర్ 18, 23న కర్ణాటక, మేఘాలయలో బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. సెలవులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేవారు ఆర్బీఐ హాలిడే క్యాలెండర్‌ను చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
న్యూక్లియర్ డ్రిల్ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది
ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. టెన్షన్ టెన్షన్
పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..
ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
For more Business News and Telugu News
Updated Date - Oct 30 , 2024 | 11:04 AM