Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
ABN, Publish Date - Jul 25 , 2024 | 08:01 AM
జులై 2024 నెల చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే నెల ఆగస్టులో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పని చేయనున్నాయనే(bank working days) విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఆగస్టులో ఏకంగా 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.
జులై 2024 నెల చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలో వచ్చే నెల ఆగస్టులో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) ఉన్నాయి. ఎన్ని రోజులు పని చేయనున్నాయనే(bank working days) విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఆగస్టులో ఏకంగా 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ క్రమంలో మీరు సెలవుల గురించి తెలుసుకోకుండా బ్యాంకు పనుల కోసం వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సెలవుల జాబితాలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, పలు పండుగ రోజులు కూడా కలిసి ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఆగస్టు 2024 బ్యాంక్ సెలవుల జాబితా (Bank Holidays list August 2024)
ఆగస్టు 3, 2024 - కేర్ పూజ కారణంగా అగర్తలో బ్యాంకులు బంద్
ఆగస్టు 4, 2024 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 8, 2024 - టేన్ డాగ్ ల్హో రమ్ సందర్భంగా గాంగ్టక్ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 10, 2024 - రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
ఆగస్టు 11, 2024 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 13, 2024 - పేట్రియాట్ డే సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు హాలిడే
ఆగస్టు 15, 2024 - స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 18, 2024 - ఆదివారం నేపథ్యంలో బ్యాంకులు బంద్
ఆగస్టు 19, 2024 - రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరాఖండ్, డామన్ అండ్ డయ్యూ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 20, 2024 - శ్రీనారాయణ గురు జయంతి సందర్భంగా కొచ్చి, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి
ఆగస్టు 24, 2024 - నాల్గో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
ఆగస్టు 25, 2024 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
ఆగస్టు 26, 2024 - శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా అండమాన్ నికోబార్, పంజాబ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, డామన్ డయ్యూ, నాగాలాండ్, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఒడిశా, సిక్కిం, గుజరాత్ ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, త్రిపురలలో బ్యాంకులకు సెలవు.
ఇవి కూడా చదవండి:
Gold and Silver Prices Today: వావ్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
బీఎండబ్ల్యూ మోటోరాడ్ తొలి ఈ-స్కూటర్
కొలువుల కల్పనలో ప్రైవేటు రంగం బాధ్యత కీలకం
Read More Business News and Latest Telugu News
Updated Date - Jul 25 , 2024 | 08:12 AM