Domestic stock markets : జర జాగ్రత్త..!
ABN, Publish Date - Aug 05 , 2024 | 06:04 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం, తయారీ రంగం, నిరుద్యోగుల డేటా ఆందోళన కలిగిస్తున్నాయి...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం, తయారీ రంగం, నిరుద్యోగుల డేటా ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో మళ్లీ ఆర్థిక మాంద్యం భయాలు మొదలయ్యాయి. గత శుక్రవారం యూఎస్, యూరప్, ఆసియా దేశాల సూచీలు భారీగా పతనమయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉండటం సానుకూల అంశం. ఈ వారం నిఫ్టీకి 24,600 వద్ద మద్దతు, 24,850 వద్ద నిరోధ స్థాయిలున్నాయి. ఆటుపోట్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన షేర్లలో పెట్టుబడులు పెట్టడం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
దీపక్ ఫెర్టిలైజర్స్: గత నాలుగు నెలల నుంచి ఈ షేరు మంచి అప్‌ట్రెండ్‌ను కనబరుస్తూ వస్తోంది. వాల్యూ మ్ కూడా పెరుగుతోంది. మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించటంతో మదుపరుల చూపు ఈ షేరుపై పడింది. గత శుక్రవారం ఈ షేరు 2.89 శాతం లాభంతో రూ.961 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.950 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.1,040/1,090 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.922 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్: జూన్ త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ షేరు టైట్ రేంజ్‌లో ట్రేడవుతోంది. పైగా చివరి నాలుగు సెషన్లలో అదరగొట్టింది. కీలక నిరోధ స్థాయిలో రౌండింగ్ బేస్ ఏర్పడుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ కూడా పెరుగుతోంది. గత శుక్రవారం ఈ షేరు 1.24 శాతం లాభంతో రూ.1,659 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.1,650/1,630 శ్రేణిలో ఎంటరై రూ.1,780/1,820 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,600 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్: జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరులో తక్కువ వాల్యూమ్‌తో స్వల్ప పుల్‌బ్యాక్ కనిపించింది. అయితే చివరి రెండు సెషన్లలో షేరు లాభపడింది. గత శుక్రవారం ఈ షేరు 1.11 శాతం లాభంతో రూ.6,964 వద్ద క్లోజైంది. మూమెంటమ్ ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.6,910 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.7,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.6,870 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
అదానీ విల్మర్: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తున్న ఈ షేరు ప్రస్తుతం బాటమ్‌కు చేరినట్లే కనిపిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ ఫుడ్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేస్తారన్న వార్తలతో మళ్లీ మూమెంటమ్ పెరిగింది. గత శుక్రవారం 10 శాతం లాభంతో రూ.383 వద్ద ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.370/380 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.425/440 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.355 వద్ద కచ్చితమైన స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
సుజ్లాన్ ఎనర్జీ: కంపెనీలో టర్న్ అరౌండ్ పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ షేరు ఐదేళ్ల గరిష్ఠాన్ని బ్రేక్ చేసింది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ గణనీయంగా పెరుగుతున్నాయి. పైగా జూన్ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం సానుకూల అంశం. గత శుక్రవారం ఈ షేరు 4.96 శాతం లాభంతో రూ.71.35 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లోకి రూ.70 వద్ద ఎంటరై రూ.76/81 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.67 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
Updated Date - Aug 05 , 2024 | 06:04 AM