ఏఐ వినియోగంలో జర జాగ్రత్త
ABN, Publish Date - Oct 22 , 2024 | 01:00 AM
కృత్రిమ మేధ (ఏఐ) వంటి టెక్నాలజీల వినియోగం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ కోరారు. అనేక సవాళ్లతో కూడిన ఈ టెక్నాలజీల విషయంలో ఏ మాత్రం...
ఆదమరిస్తే ఇక అంతే
ఇది రెండు వైపులా పదునున్న కత్తి
భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) వంటి టెక్నాలజీల వినియోగం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ కోరారు. అనేక సవాళ్లతో కూడిన ఈ టెక్నాలజీల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని హెచ్చరించారు. ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్లు ఏఐ సాయంతో అచ్చం తన కంఠస్వరాన్ని అనుకరిస్తూ దుబాయ్‌లోని తన కంపెనీ ఉన్నతాధికారి ద్వారా పెద్దమొత్తంలో నిధు లు బదిలీ చేయించుకునేందుకు ఎలా ప్రయత్నించిందీ మిట్టల్ వివరించారు. తాను ఎప్పుడూ పెద్ద మొత్తంలో నిధుల బదిలీ అడగననే విషయం తెలిసిన ఆ అధికారి అప్రమత్తతో ఆ ప్రమాదం తప్పిందన్నారు. ఆ సైబర్ కేటుగాడు పంపిన తన వాయిస్ మెసేజీ విని తానే ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీల కారణంగా ముందు ముందు డిజిటల్ సంతకాలకూ ప్రమాదం తప్పకపోవచ్చని మిట్టల్ తెలిపారు.
ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆయన మ్యాజిక్ బుల్లెట్‌గా అభివర్ణించారు. ఈ ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మారుమూల ప్రాంతాలకూ మొబైల్, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించడం సాధ్యపడుతుందన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 01:00 AM