అప్రమత్తంగా ఉండటం బెటర్!
ABN, Publish Date - May 06 , 2024 | 06:13 AM
దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లలో వదంతులు మదుపరులను...
దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లలో వదంతులు మదుపరులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆ తర్వాత సూచీల మూమెంటమ్‌ను అంచనా వేయొచ్చు. గత శుక్రవారం గరిష్ఠ స్థాయిల్లో సూచీలు బలమైన నిరోధాన్ని ఎదుర్కొన్నాయి. ఈ వారం నిఫ్టీకి 22,450 వద్ద మద్దతు, 22,650 వద్ద నిరోధ స్థాయిలున్నాయి.
స్టాక్ రికమండేషన్స్
పిరామల్ ఫార్మా: నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు అదరగొడుతోంది. ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్స్ క్రమంగా పెరుగుతున్నాయి. పైగా 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.149ని బ్రేక్ చేసింది. గత శుక్రవారం ఈ షేరు 5.6ు లాభంతో రూ.151 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.150 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.177/185 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.143 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కోల్ ఇండియా: సుదీర్ఘ అప్‌ట్రెండ్ తర్వాత ఈ కౌంటర్‌లో స్వల్ప దిద్దుబాటు జరిగింది. మరోసారి ఈ షేరు జీవితకాల గరిష్ఠాన్ని చేరే అవకాశం ఉంది. గత ఈ వారం నెల గరిష్ఠ స్థాయిలను అధిగమించింది. వాల్యూమ్ అనూహ్యంగా పెరుగుతోంది. గత శుక్రవారం ఈ షేరు 4.56 శాతం లాభంతో రూ.474 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.460/470 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.545/625 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.445 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ప్రెస్టీజ్ ఎస్టేట్స్: ఈ కౌంటర్‌లో మూమెంటమ్ బాగుంది. రూ.1,440 వద్ద ఆల్‌టైమ్ హైను బ్రేక్ చేసింది. స్వల్ప దిద్దుబాటు అనంతరం ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్ పుంజుకుంది. నష్టాల సెషన్‌లో కూడా ఈ షేరు 4.27 శాతం లాభంతో రూ.1,460 వద్ద ముగిసింది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లో రూ.1,450 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.1,570/1,650 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,430 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
జిందాల్ సా: ఈ మెటల్ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగిపోతోంది. సుదీర్ఘ అప్‌ట్రెండ్ తర్వాత ఇందులో కన్సాలిడేషన్ జరిగింది. వాల్యూమ్ పెరుగుతుండటంతో మార్చి రెండో వారం నుంచి ఈ షేరు ఏకంగా 50 శాతం పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు 3.49 శాతం లాభంతో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.575 వద్ద స్థిరపడింది. మూమెంటమ్ ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లోకి రూ.570/550 శ్రేణిలో ప్రవేశించి రూ.665/720 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.540 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టొరెంట్ ఫార్మా: గత వారం ఈ కౌంటర్‌లో వాల్యూమ్ భారీగా పెరిగింది. పైగా స్వల్పకాలిక నిరోధాన్ని బ్రేక్ చేసింది. సూపర్‌ట్రెండ్ ఇండికేటర్ సైతం ‘బై’ సిగ్నల్ ఇచ్చింది. గత శుక్రవారం ఈ షేరు 2.42 శాతం లాభంతో రూ.2,734 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.2,730/2,710 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.2,840/2,960 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,700 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
Updated Date - May 06 , 2024 | 06:13 AM