అప్రమత్తంగా ఉండడమే బెటర్
ABN, Publish Date - Nov 04 , 2024 | 05:55 AM
స్టాక్ మార్కెట్ ఈ వారం మిశ్రమంగా ట్రేడ్ కావచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా ఉండడమే మం చిది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీల షేర్లు, ప్రస్తుతం...
స్టాక్ మార్కెట్ ఈ వారం మిశ్రమంగా ట్రేడ్ కావచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా ఉండడమే మం చిది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందిన కొన్ని కంపెనీల షేర్లు, ప్రస్తుతం ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ధరల్లో మదుపరులు ఈ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించవచ్చు. ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు కూడా ప్రస్తుతం ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే మిడ్ క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల కొనుగోళ్లలో మాత్రం జాగ్రత్తలు పాటించక తప్పదు.
ఈ వారం స్టాక్ రికమండేషన్లు...
ఐషర్ మోటార్స్: సుదీర్ఘకాలంగా అప్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కంపెనీ షేర్లు, గత ఆరు నెలలుగా కన్సాలిడేట్ అవుతున్నాయి. ఈపీఎస్, సేల్స్ మెరుగ్గా ఉండడంతో నిఫ్టీతో పోలిస్తే మంచి జోరు మీద ఉన్నాయి. కీలక మద్దతు స్థాయి రూ.4,500 వద్ద మళ్లీ పుంజుకున్నాయి. గత శుక్రవారం రూ.4,593 వద్ద ముగిశాయి. మదుపరులు రూ.4,970/5,050 టార్గెట్ ధరతో రూ.4,900 వద్ద ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.4,860.
ఐఆర్‌ఎ్‌ఫసీ: జూలైలో జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరిన ఈ షేర్లు ఇప్పటికే 42 శాతం దిద్దుబాటుకు లోనయ్యాయి. రూ.133 వద్ద కీలక మద్దతుతో అప్‌ట్రెండ్ బాట పట్టి గత వారం రూ.158 వద్ద ముగిశాయి. రూ.162/168 స్వల్పకాలిక టార్గెట్‌తో మదుపరులు ఈ కౌంటర్లో రూ.157 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.155
బ్యాంక్ ఆఫ్ బరోడా: తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండడంతో బీఓబీ షేర్లపై మళ్లీ ఆసక్తి పెరిగింది. జీవిత కాల గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం దిద్దుబాటు జరిగాక రూ.230 స్థాయిలో స్థిరమైన కన్సాలిడేషన్ కనిపిస్తోంది. గత వారం రూ.230 వద్ద ముగిసిన ఈ షేర్లను మదుపరులు రూ.275 టార్గెట్‌తో రూ.250 వద్ద కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ : రూ.245.
మోతీలాల్ ఓస్వాల్: ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రతి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం, పెరుగుతున్న అమ్మకాలు, ఈపీఎస్ కంపెనీకి కలిసి వచ్చే ప్రధాన సానుకూలాంశాలు. బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ఉన్నా మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ షేర్లు ఇప్పటికీ మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి. గత వారం రూ970 వద్ద ముగిసిన ఈ షేర్లను ఇన్వెస్టర్లు రూ.995 టార్గెట్‌తో రూ.975 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.970.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
Updated Date - Nov 04 , 2024 | 05:55 AM