ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యులిప్స్‌ ప్రచారంపై జర జాగ్రత్తఛ

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:12 AM

యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్స్‌ (యులిప్స్‌)పై భారతీయ బీమా అభివృద్ధి, నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది.

పెట్టుబడి సాధనాలుగా ప్రచారం చేయొద్దు : ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్స్‌ (యులిప్స్‌)పై భారతీయ బీమా అభివృద్ధి, నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని పెట్టుబడి సాధనాలుగా ప్రచారం చేయవద్దని బీమా సంస్థలను ఆదేశించింది. దీనికి సంబంధించి ఒక మాస్టర్‌ సర్క్యులర్‌ విడుదల చేసింది. ఈ పథకాలు సాంప్రదాయ ఎండోమెంట్‌ పాలసీలకు భిన్నమైనవని చెప్పడంతో పాటు వీటిపై రాబడులు మార్కెట్‌ పనితీరుపై ఆధారపడి ఉంటాయనే విషయాన్ని బీమా సంస్థలు మదుపరులకు ముందుగానే స్పష్టం చేయాలని కోరింది.

బీమా సంస్థల ఏజెంట్లు అధిక రాబడుల పేరుతో ఈ పాలసీను మదుపరులకు అంటగడుతున్నట్టు వార్తలు రావడంతో ఐఆర్‌డీఏఐ ఈ చర్య తీసుకుంది. అలాగే పార్టిసిపెంట్‌ ఎండోమెంట్‌ పాలసీలపై ఉదహరించిన రాబడులకు కూడా హామీ లేదని బీమా సంస్థలు స్పష్టం చేయాలని కోరింది. యులిప్స్‌, వేరియబుల్‌ పే అవుట్‌ ఆప్షన్‌తో కూడిన యాన్యుటీ పథకాల ప్రచారంలో వాటిలో ఉండే నష్ట భయాలనూ ప్రముఖంగా పేర్కొనాలని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.

ఎన్‌పీఎస్‌ ఖాతాదారులకు కొత్త ఆప్షన్‌

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) పథకాన్ని మరింత ఆకర్షణీయంగా చేయాలని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వేతర ఖాతాదారుల కోసం ఈ ఏడాది సెప్టెంబరు నాటికి కొత్త లైఫ్‌ సైకిల్‌ ఆప్షన్‌ ఫండ్‌ ఆప్షన్‌ ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. పీఎ్‌ఫఆర్‌డీఏ చైర్మన్‌ దీపక్‌ మొహంతి ఈ విషయం వెల్లడించారు. ఎన్‌పీఎ్‌సలో ఈ కొత్త ఆప్షన్‌ ద్వారా ఖాతాదారులు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెంచుకునే ఆప్షన్‌ కల్పించాలని పీఎ్‌ఫఆర్‌డీఏ భావిస్తోంది. దీనివల్ల మార్కెట్‌ బాగుంటే ఎన్‌పీఎస్‌ ఖాతాదారులకు మరిన్ని రాబడులు లభిస్తాయి. ఇందుకోసం ఖాతాదారుల టాపరింగ్‌ వయసుని ప్రస్తుత 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకు పెంచబోతున్నట్టు తెలిపారు.

Updated Date - Jun 22 , 2024 | 07:17 AM

Advertising
Advertising