Big C : బిగ్ సీ 22వ వార్షికోత్సవ ఆఫర్లు
ABN, Publish Date - Dec 12 , 2024 | 06:10 AM
దక్షిణాదిలో అతిపెద్ద మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ.. 22వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.5,999 విలువైన స్మార్ట్‌వాచ్ లేదా రూ.1,799 విలువైన ఇయర్ బర్డ్స్‌ను రూ.22కే
హైదరాబాద్: దక్షిణాదిలో అతిపెద్ద మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ.. 22వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.5,999 విలువైన స్మార్ట్‌వాచ్ లేదా రూ.1,799 విలువైన ఇయర్ బర్డ్స్‌ను రూ.22కే అందిస్తున్నట్లు బిగ్ సీ సీఎండీ ఎం బాలు చౌదరి తెలిపారు. అంతేకాదు, 10 శాతం వరకు తక్షణ క్యాష్ బ్యాక్, మొబైల్ కొనుగోలు కోసం జీరో డౌన్‌పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను సైతం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇవే గాక, ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన ఒక బహుమతిని కూడా అందిస్తామన్నారు. వివో, ఒప్పో, ఎంఐ, రియల్‌మీ, వన్‌ప్ల్‌స మొబైల్ కొనుగోలుపై 10 శాతం వరకు తక్షణ క్యాష్ బ్యాక్, సామ్‌సంగ్ మొబైల్ కొనుగోలుపై రూ.20,000 వరకు తక్షణ క్యాష్ బ్యాక్, ఐఫోన్ కొనుగోలుపై రూ.7,000 వరకు తక్షణ డిస్కౌంట్, బ్రాండెడ్ యాక్సెసరీ్‌సపై 51 శాతం వరకు డిస్కౌంట్ కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏటీఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, ఎయిర్ కండీషనర్‌లు కొనుగోలు చేసే సదుపాయాన్నీ కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Updated Date - Dec 12 , 2024 | 06:10 AM