ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బ్రైట్‌కామ్‌కు భారీ షాక్‌!

ABN, Publish Date - May 16 , 2024 | 05:15 AM

హైదరాబాద్‌కు చెందిన డిజిటల్‌ మార్కెటింగ్‌ సొ ల్యూషన్స్‌ కంపెనీ బ్రైట్‌కామ్‌ గ్రూప్‌నకు స్టాక్‌ ఎక్సేంజ్‌లు భారీ షాకిచ్చాయి. వచ్చేనెల 14 నుంచి కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ ప్రకటించాయి...

  • వచ్చేనెల 14 నుంచి షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

  • సర్క్యులర్‌ జారీ చేసిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు

వరుసగా రెండు త్రైమాసికాల ఆర్థిక ఫలితాలు ప్రకటించనందువల్లే..

ముంబై: హైదరాబాద్‌కు చెందిన డిజిటల్‌ మార్కెటింగ్‌ సొ ల్యూషన్స్‌ కంపెనీ బ్రైట్‌కామ్‌ గ్రూప్‌నకు స్టాక్‌ ఎక్సేంజ్‌లు భారీ షాకిచ్చాయి. వచ్చేనెల 14 నుంచి కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈ ప్రకటించాయి. వరుసగా రెండు త్రైమాసికాల (2023 జూలై- సెప్టెంబరు, అక్టోబరు-డిసెంబరు) ఆర్థిక ఫలితాలను ప్రకటించడంలో కంపెనీ విఫలమైన కారణంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ 2023 జూలై 11న జారీ చేసిన మాస్టర్‌ సర్క్యులర్‌లోని 33వ నిబంధనకు అనుగుణంగా కంపెనీపై చర్యలు చేపట్టినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు తమ సర్క్యులర్‌లో వెల్లడించాయి. నియంత్రణ మండలి నిబంధనలను పాటించేవరకు బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ షేర్ల ట్రేడింగ్‌పై సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశాయి. షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేసిన 15 రోజుల తర్వాత, ఆరు నెలల వరకు ప్రతివారంలో మొదటిరోజున ఈ షేర్లలో ట్రేడింగ్‌కు అనుమతించడం జరుగుతుందని తెలిపాయి. బీఎ్‌సఈలో బ్రైటాకామ్‌ గ్రూప్‌ షేరు బుధవారం 4.96 శాతం క్షీణించి రూ.12.27 వద్దకు పడిపోయింది. సోమవారం నాడు షేరు ఏడాది కనిష్ఠ స్థాయి రూ.12.19 వద్దకు పతనమైంది.


5.7 లక్షల మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు

ఇరుక్కు పోయినట్లేనా..?

ఈ సస్పెన్షన్‌ కాలంలో కంపెనీ ప్రమోటర్‌ వాటా షేర ్లను స్తంభింపజేయడంతోపాటు డీమ్యాట్‌ ఖాతాలోని ఇత ర సెక్యూరిటీలను సైతం స్తంభింపజేయడం జరుగుతుందని బీఎ్‌సఈ తెలిపింది. ప్రస్తుతం బ్రైట్‌కామ్‌ గ్రూప్‌లో ప్రమోటర్‌కు వాటా 18.38 శాతంగా ఉండగా.. మిగతా 81.62 శాతం వాటా పబ్లిక్‌ వాటాదారుల చేతుల్లో ఉంది. పబ్లిక్‌ షేర్‌హోల్డర్లలో 5.7 లక్షల మంది రిటైల్‌ మదుపరులే. వీరి చేతుల్లో కంపెనీకి చెందిన 37.89 శాతం వాటాకు సమానమైన షేర్లున్నాయి. షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత ఆదేశాల నేపథ్యంలో మున్ముందు సెషన్లలో ఈ కంపెనీ షేరు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. దాంతో బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ షేర్లు కలిగి ఉన్న చిన్న మదుపరులు భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి.


కంపెనీకి దెబ్బ మీద దెబ్బ

లిస్టింగ్‌ నిబంధనల అతిక్రమణ, ఇన్వెస్టర్లకు బహిర్గతం చేయాల్సిన సమాచారాన్ని దాచిపెట్టడం, నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ రెండేళ్లకు పైగా కాలం నుంచే సెబీ నిఘాలో ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు ఈ కంపెనీ వ్యయాలను తక్కువ చేసి, లాభాలను పెంచి చూపినట్లు సెబీ గుర్తించింది. కంపెనీ పెద్ద మోసానికి పాల్పడిందని, ఐదేళ్లలో కంపెనీ తన పద్దుల్లో రూ.1,280 కోట్ల విలువైన లావాదేవీలను కప్పిపుచ్చిందని నియంత్రణ మండలి వెల్లడించింది. బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ సురేశ్‌ కుమార్‌ రెడ్డి ఏ కంపెనీలోనూ డైరెక్టర్‌ పదవి చేపట్టకుండా ఈ ఫిబ్రవరిలో సెబీ నిషేధం విధించింది. అంతేకాదు, సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి కంపెనీని నిషేధించింది.

Updated Date - May 16 , 2024 | 05:15 AM

Advertising
Advertising