బీఎండబ్ల్యూ మోటోరాడ్ తొలి ఈ-స్కూటర్
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:57 AM
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ పేరుతో ప్రీమియం ఈ-స్కూటర్‌ను బుధవారం లాంచ్ చేసింది...
భారత మార్కెట్లోకి ప్రవేశం
ధర 15 లక్షలు
న్యూఢిల్లీ: జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూకు చెందిన ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించింది. ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ పేరుతో ప్రీమియం ఈ-స్కూటర్‌ను బుధవారం లాంచ్ చేసింది. దీని ధర రూ.14.90 లక్షలు. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యంత ఖరీదైన ఈ-స్కూటర్. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి కూడా. ఇది గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించగలదని, 2.6 సెకన్లలో సున్నా నుంచి 50 కి.మీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఈ వాహనం.. సింగిల్ చార్జింగ్‌తో 130 కి.మీ వరకు ప్రయాణించగలదని తెలిపింది. 10.25 అంగుళాల టీఎ్‌ఫటీ డిస్‌ప్లే విత్ స్ప్లిట్ స్ర్కీన్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, మూడు రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, కీ లెస్ రైడ్, రివర్సింగ్ ఎయిడ్ వంటి ఫీచర్లతో
బీఎండబ్ల్యూ 5 సిరీస్ సరికొత్తగా..
బీఎండబ్ల్యూ ఇండియా బుధవారం మూడు కొత్త కార్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో సరికొత్త బీఎండబ్ల్యూ 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్ (ఎల్‌డబ్ల్యూబీ) కారుతో పాటు అప్‌డేటెడ్ మినీకూపర్ ఎస్, ఆల్ ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ ఉన్నాయి. ఎనిమిదో తరం బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ ధర రూ.72.90 లక్షలు కాగా.. మినీ కూపర్ ఎస్ రేటు రూ.44.90 లక్షలు, ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ ధర రూ.54.90 లక్షలుగా ఉంది.
ఈ స్కూటర్‌ను డిజైన్ చేసినట్లు బీఎండబ్ల్యూ మోటోరాడ్ తెలిపింది. భారత్‌లోని ఎంపిక చేసిన మెట్రోపాలిటన్ నగరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు, సెప్టెంబరు నుంచి కస్టమర్లకు డెలివరీ అందించనున్నట్లు కంపెనీ తెలియచేసింది.
Updated Date - Jul 25 , 2024 | 04:57 AM