ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటో మార్కెట్‌ జోరుకు బ్రేక్‌

ABN, Publish Date - Aug 02 , 2024 | 02:42 AM

దేశంలోని ప్రముఖ కార్ల తయా రీ కంపెనీలన్నింటి అమ్మకాలు జూలై నెలలో నిరాశావహంగా ఉన్నాయి. ప్రధానంగా అగ్రగామి కంపెనీలు మారుతి సుజుకీ, హ్యుండ య్‌, టాటా మోటార్స్‌ అమ్మకాల్లో క్షీణత నమోదు చేశాయి...

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ కార్ల తయా రీ కంపెనీలన్నింటి అమ్మకాలు జూలై నెలలో నిరాశావహంగా ఉన్నాయి. ప్రధానంగా అగ్రగామి కంపెనీలు మారుతి సుజుకీ, హ్యుండ య్‌, టాటా మోటార్స్‌ అమ్మకాల్లో క్షీణత నమోదు చేశాయి. వాహనాలకు డిమాండు తగ్గడం ఇందుకు కారణం. జూలై నెలలో మారుతి 1,37,463 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన విక్రయాలు 1,52,126తో పోల్చితే అమ్మకాల్లో 9.64 శాతం క్షీణత నమోదయింది. ప్రధానంగా మినీ సెగ్మెంట్‌లోకి వచ్చే ఆల్టో, ఎస్‌-ప్రెసో కార్ల అమ్మకాలు 9590 నుంచి 9960కి పెరిగాయి. కాని కాంపాక్ట్‌, యుటిలిటీ కార్ల అమ్మకాలు తగ్గాయి. ఇదిలా ఉండగా ఫ్యాక్టరీ నుంచి డీలర్లకు పంపిన వాహనాల సంఖ్య జూలై నెలలో 3 శాతం తగ్గి 50,701 యూనిట్ల నుంచి 49,013 యూనిట్లకు తగ్గిందని హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా ప్రకటించింది. టాటా మోటార్స్‌ 70,161 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో జరిగిన 78,844 అమ్మకాలతో పోల్చితే 11 శాతం క్షీణత నమోదయింది.


టూ వీలర్ల జోరు: ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం జోరుగానే సాగాయి. బజాజ్‌ ఆటో 2,10,997 వాహనాలు విక్రయించింది. గత ఏడాది జూలైతో (1,79,263 యూనిట్లు) పోల్చితే అమ్మకాలు 18 శాతం పెరిగాయి.

  • టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అమ్మకాల్లో 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కంపెనీ అమ్మకాలు 2,35,230 నుంచి 2,54,250కి పెరిగాయి.

  • హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా అమ్మకాలు 41 శాతం పెరిగి 4,39,118 యూనిట్లకు చేరాయి.

Updated Date - Aug 02 , 2024 | 02:42 AM

Advertising
Advertising
<