ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రికార్డుల ర్యాలీకి బ్రేక్‌

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:05 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఆరు రోజుల వరుస రికార్డుల ర్యాలీకి తెరపడింది.

సెన్సెక్స్‌ 269 పాయింట్లు డౌన్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఆరు రోజుల వరుస రికార్డుల ర్యాలీకి తెరపడింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో శుక్రవారం ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడంతో పాటు ఐటీ షేర్లలో కొనుగోళ్లు నష్టాలకు కొంత అడ్డుకట్ట వేయగలిగాయి. వారాంతం ట్రేడింగ్‌ లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత గంటకే సెన్సెక్స్‌ నష్టాల్లోకి మళ్లింది. ఒకదశలో సూచీ 677 పాయింట్ల మేర క్షీణించి 77,000 స్థాయిని సైతం కోల్పోయింది. మళ్లీ కాస్త తేరుకుని 269.03 పాయింట్ల నష్టంతో 77,209.90 వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికొస్తే, ప్రారంభ ట్రేడింగ్‌లో 100 పాయింట్ల వరకు పెరిగి 23,667.10 వద్ద సరికొత్త ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. కానీ, జోరును కొనసాగించలేక డీలా పడిన సూచీ చివరికి 65.90 పాయింట్ల నష్టం తో 23,501.10 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 19 నష్టపోయాయి.

అవాన్స్‌ రూ.3,500 కోట్ల ఐపీఓ: విద్యా రుణాలందించే ఎన్‌బీఎ్‌ఫసీ అవాన్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓ ద్వారా సంస్థ రూ.1,000 కోట్ల తాజా ఈక్విటీ జారీతోపాటు ప్రస్తుత వాటాదారులకు చెందిన రూ.2,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించాలనుకుంటోంది. తద్వారా సంస్థ మొత్తం రూ.3,500 కోట్లు సమీకరించనుంది.

Updated Date - Jun 22 , 2024 | 04:05 AM

Advertising
Advertising