BSNL: బీఎస్ఎన్ఎల్‌కు కలిసొస్తున్న కాలం.. జియో, ఎయిర్ టెల్, వీఐకు భారీ దెబ్బ
ABN, Publish Date - Oct 25 , 2024 | 07:39 PM
జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పుడైతే టెలికాం ఛార్జీలు పెంచడం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్‌కు భారీగా కలిసొచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుంచి ప్రైవేటు టెలికాం కంపెనీలు యూజర్లను కోల్పోతుండగా.. అంతకంతకూ బీఎస్ఎన్ఎల్ లాభపడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పుడైతే టెలికాం ఛార్జీలు పెంచడం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్‌కు భారీగా కలిసొచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుంచి ప్రైవేటు టెలికాం కంపెనీలు యూజర్లను కోల్పోతుండగా.. అంతకంతకూ బీఎస్ఎన్ఎల్ లాభపడుతోంది. అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లుండటమే ఇందుకు కారణం. జులై నెలలాగే ఆగస్టుకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. జులై నెలలో ప్రధాన టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు 25 శాతం వరకు టారిఫ్ ఛార్జీలను పెంచాయి.
ఈ నిర్ణయం ప్రైవేట్ టెలికాం కంపెనీ వినియోగదారులపై ప్రభావం చూపింది. జులైలో 29 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరగా.. ఆగస్టులో 25 లక్షల మంది బీఎస్ఎన్ఎల్‌కు మారారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్‌లను సవరించేది లేదని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు మూడు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆగస్టులో 83 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. జియో అత్యధికంగా 40 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను, ఎయిర్‌టెల్ 24 లక్షలు, వొడాఫోన్ ఐడియా 18 లక్షల చొప్పున యూజర్లను కోల్పోయాయి. జులైలో ఈ మూడు టెలికాం కంపెనీల నుంచి 38.6 లక్షల యూజర్లు దూరమయ్యారు.
మార్కెట్ వాటా..
మార్కెట్ వాటా పరంగా BSNL జులైలో 7.59% నుండి ఆగస్టులో 7.84 శాతానికి పెరిగింది. ఇదే క్రమంలో.. ప్రైవేట్ టెలికాం సంస్థల మార్కెట్ వాటాలు క్షీణించసాగాయి. జులైలో 40.68% ఉన్న రిలయన్స్ జియో, ఆగస్టులో 40.53%కి పడిపోయింది. జులైలో 33.23% ఉన్న భారతీ ఎయిర్‌టెల్, ఆగస్టులో 33.07%కి పడిపోయింది. అలాగే.. Vi జులైలో 18.46% నుంచి 18.39%కి తగ్గింది. మొత్తం వైర్‌లెస్ లేదా మొబైల్ సబ్‌స్క్రైబర్‌లు జులై చివరి నాటికి 1,169.61 మిలియన్ల నుంచి ఆగస్టు చివరి నాటికి 1,163.83 మిలియన్లకు తగ్గారు. నెలవారీగా 0.49 శాతం క్షీణించింది.
పట్టణ ప్రాంతాల్లో వైర్‌లెస్ సభ్యత్వాలు జులైలో 635.46 మిలియన్ల నుంచి ఆగస్టులో 633.21 మిలియన్లకు తగ్గాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వైర్‌లెస్ సభ్యత్వాలు 534.15 మిలియన్ల నుంచి 530.63 మిలియన్లకు పడిపోయాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్ మినహా అన్ని ప్రాంతాల్లో ఆగస్టులో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లు తగ్గారు. TRAI ప్రకారం మొత్తం 14.66 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఆగస్టులో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) కోసం రిక్వస్ట్ పెట్టుకున్నారు.
Ratan Tata: రతన్ టాటా ఆస్తి ఎవరికి.. వీలునామాలో ఏముందంటే
ఇవి కూడా చదవండి..
Bandi Sanjay: ఇంతకంటే కాస్ట్‌లీ ప్రాజెక్టు.. కాస్ట్ లీ స్కామ్ ఎక్కడా లేదేమో
Kishan Reddy: రేవంత్ నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. అందుకు మేము సిద్ధమే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 25 , 2024 | 07:39 PM