Budget 2024: భారత్ FY25లో 7% ఆర్థిక వృద్ధిని నమోదు చేసే అవకాశం
ABN, Publish Date - Jan 29 , 2024 | 04:41 PM
ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర బడ్జెట్ 2024కు ముందు ఆర్థిక సమీక్షను సమర్పించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక సమీక్షలో FY25లో వాస్తవ GDP వృద్ధి దాదాపు 7% ఉండవచ్చని అంచనా వేసింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర బడ్జెట్ 2024కు ముందు ఆర్థిక సమీక్షను సమర్పించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక సమీక్షలో FY25లో వాస్తవ GDP వృద్ధి దాదాపు 7% ఉండవచ్చని అంచనా వేసింది. అదే సమయంలో 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ విలువ 7 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలిపింది. సోమవారం సమర్పించిన సమీక్షలో గత 10 సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పోలికను ప్రస్తావించింది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Stock markets: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1241 పాయింట్లు జంప్
ఈ నివేదిక ప్రకారం బలమైన ఆర్థిక రంగం, నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా GDP వృద్ధి రేటు 7 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇటివల నెలకొన్న పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకు ఆటంకంగా మారుతున్నాయని తెలిపింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం కూడా దాదాపు 4 శాతానికి తగ్గుతుందని చెప్పింది. ఇక FY24లో భారత ఆర్థిక వ్యవస్థ వరుసగా మూడో సంవత్సరం 7 శాతం వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3% కంటే ఎక్కువ వృద్ధి సాధించడానికి కష్టపడుతుండటం విశేషం.
ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందన్నారు. FY25లో వాస్తవ పరంగా మరో 7 శాతం వృద్ధి చెందుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.
మినీ ఎకనామిక్ సర్వేగా పరిగణించబడిన ఈ నివేదిక అన్ని సానుకూల పరిణామాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత్ వచ్చే మూడేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది. ఈ క్రమంలో 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది.
Updated Date - Jan 29 , 2024 | 04:41 PM