Budget 2024: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ABN, Publish Date - Feb 01 , 2024 | 11:38 AM
ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరిచేలా కృషి చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆహార సమస్యలు పరిష్కరించబడ్డాయని చెప్పారు.
ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరిచేలా కృషి చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆహార సమస్యలు పరిష్కరించబడ్డాయని చెప్పారు. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని తెలిపారు. ప్రాథమిక అవసరాలు నెరవేరాయని, దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆదాయం పెరిగిందని తెలిపారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రకటించారు. ప్రజలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, అవినీతి, బంధుప్రీతిని అంతం చేశామని చెప్పారు.
మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోంది. మా దేశం యువత ఆకాంక్షలు ఉన్నతమైనవి, వర్తమానంలో ఉజ్వల భవిష్యత్తుపై ఆశ విశ్వాసం కల్గి ఉన్నారు. గత 10 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో అపూర్వమైన మార్పు వచ్చింది. 2014లో దేశం పెద్ద సవాళ్లను ఎదుర్కొంది. ప్రభుత్వం ఆ సవాళ్లను అధిగమించి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టింది. ప్రజాహిత సంస్కరణలు అమలు చేశామని నిర్మలా అన్నారు.
Updated Date - Feb 01 , 2024 | 11:42 AM