అంతర్జాతీయ బాండ్ మార్కెట్‌లోకి కెనరా బ్యాంకు
ABN, Publish Date - Sep 05 , 2024 | 02:53 AM
ఐదు సంవత్సరాల విరామం తర్వాత కెనరా బ్యాంకు అంతర్జాతీయ బాండ్ మార్కెట్లో ప్రవేశించింది. ఐఎ్‌ఫఎ్‌ససి బ్యాంకిం గ్ యూనిట్ ద్వారా ఐదేళ్ల కాల పరిమితిగల బాండ్లు...
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఐదు సంవత్సరాల విరామం తర్వాత కెనరా బ్యాంకు అంతర్జాతీయ బాండ్ మార్కెట్లో ప్రవేశించింది. ఐఎ్‌ఫఎ్‌ససి బ్యాంకిం గ్ యూనిట్ ద్వారా ఐదేళ్ల కాల పరిమితిగల బాండ్లు జారీ చేసి 30 కోట డాలర్లు (సుమారు రూ.2,520 కోట్లు) సమీకరించిం ది. ఈ బాండ్లపై చెల్లించే వడ్డీరేటును 4.896 శాతంగా నిర్ణయించింది. వ్యాపార విస్తరణకు ఈ నిధులు వినియోగించనున్నట్టు బ్యాంకు ఎండీ, సీఈ ఓ సత్యనారాయణరాజు తెలిపారు. ఆసియా, పశ్చిమాసియా,, యూర్‌పలకు చెందిన 72 మంది మదుపరులు ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టారు.
Updated Date - Sep 05 , 2024 | 02:53 AM