ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కెనరా బ్యాంక్‌ లాభం రూ.3,905 కోట్లు

ABN, Publish Date - Jul 26 , 2024 | 04:30 AM

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ ముగిసిన త్రైమాసికంలో రూ.3,905 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,535 కోట్లతో పోల్చితే లాభం 10 శాతం పెరిగింది..

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ ముగిసిన త్రైమాసికంలో రూ.3,905 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.3,535 కోట్లతో పోల్చితే లాభం 10 శాతం పెరిగింది. మొండి బకాయిలు తగ్గడం ఇందుకు దోహదపడింది. కాగా బ్యాంక్‌ త్రైమాసికాదాయం రూ.29,823 కోట్ల నుంచి రూ.34,020 కోట్లకు పెరిగింది. వడ్డీల ద్వారా జూన్‌ త్రైమాసికంలో రూ,28,701 కోట్లు ఆదాయం లభించింది. నికర వడ్డీ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.8,666 కోట్ల నుంచి రూ.9,166 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ మాత్రం 3.05 శాతం నుంచి 2.90 శాతానికి తగ్గింది. భవిష్యత్తులో ఎన్‌ఐఎం మెరుగుపడి 2.95 శాతం వద్ద స్థిరపడుతుందని భావిస్తున్నట్టు బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ కె.సత్యనారాయణ రాజు చెప్పారు. ఆస్తుల నాణ్యత విషయానికి వస్తే బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 5.15 శాతం నుంచి 4.14 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 1.57 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గాయి. ఎన్‌పీఏలకు కేటాయింపులు రూ.2,418 కోట్ల నుంచి రూ.2,171 కోట్లకు తగ్గాయి.


బ్యాంక్‌ సీఆర్‌ఏఆర్‌ (క్యాపిటల్‌ అడిక్వసీ నిష్పత్తి) 16.28 శాతానికి పెరిగింది. ప్రొవిజన్‌ కవరేజి నిష్పత్తి (పీసీఆర్‌) 118 బేసిస్‌ పాయింట్లు పెరిగి 89.22 శాతానికి చేరింది. ఈ ఏడాది చివరికి పీసీఆర్‌ 90 శాతం దాటాలని బ్యాంక్‌ భావిస్తున్నదని రాజు చెప్పారు. ప్రతి త్రైమాసికంలోనూ రూ.1,000 కోట్లు మొండి బకాయిలు వసూలు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు.

రూ.8,500 కోట్ల సమీకరణ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.8,500 కోట్ల నిధులు సమీకరించేందుకు బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు అనుమతించిందని ఎండీ తెలిపారు. టియర్‌ 1, టియర్‌ 2 బాండ్ల ద్వారా ఈ నిధులు సమీకరిస్తామన్నారు. అలాగే తమ అనుబంధ సంస్థలు కెనరా హెచ్‌ఎ్‌సబీసీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, కెనరా రొబెకో ఏఎంసీ రెండింటిలోనూ 25 శాతం వంతున వాటాలు విక్రయించాలని నిర్ణయించినట్టు రాజు వెల్లడించారు.

Updated Date - Jul 26 , 2024 | 04:30 AM

Advertising
Advertising
<