ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇప్పటికీ నగదే రారాజు

ABN, Publish Date - Apr 30 , 2024 | 06:27 AM

పెద్ద నోట్ల రద్దు, యూపీఐ చెల్లింపుల వంటి మార్పులెన్ని వచ్చినా.. దేశంలో ఇప్పటికీ కరెన్సీ నోట్లదే హవా. 2017 మార్చిలో ఆర్థిక వ్యవస్థలో రూ.13.35 లక్షల కోట్లుగా ఉన్న నగదు చలామణి (సీఐసీ) 2024 మార్చి నాటికి రూ.35.15 లక్షల కోట్లకు..

ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు రెట్టింపు

ఏటీఎంల నుంచి సగటున నెలకు రూ.1.43 కోట్లు విత్‌డ్రాయల్స్‌

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, యూపీఐ చెల్లింపుల వంటి మార్పులెన్ని వచ్చినా.. దేశంలో ఇప్పటికీ కరెన్సీ నోట్లదే హవా. 2017 మార్చిలో ఆర్థిక వ్యవస్థలో రూ.13.35 లక్షల కోట్లుగా ఉన్న నగదు చలామణి (సీఐసీ) 2024 మార్చి నాటికి రూ.35.15 లక్షల కోట్లకు చేరడమే ఇందుకు సాక్ష్యం. బ్యాంక్‌ ఖాతాదారులూ, ఏటీఎంల నుం చీ పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తున్నారు. వీరు గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఒక్కో ఏటీఎం నుంచి నెలకు సగటున రూ.1.43 కోట్ల వరకు నగదును విత్‌డ్రా చేశారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ఇది 5.51 శాతం ఎక్కువని సోమవారం వెలువడిన ‘సీఎంఎస్‌ కన్‌జంప్షన్‌ రిపోర్ట్‌’ తెలిపింది. రూ.2,000 నోట్లలో 97.83 శాతం బ్యాంకుల్లో డిపాజిట్‌ అయినప్పటికీ దేశంలో నగదు వినియోగం పెరగడం విశేషం.


ఈ రాష్ట్రాల్లో మరింత ఎక్కువ: దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే కర్ణాటకలో ఏటీఎంల ద్వారా పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం అక్కడి బ్యాంక్‌ ఖాతాదారులు ఒక్కో ఏటీఎం నుంచి నెలకు సగటున రూ.1.83 కోట్లు విత్‌డ్రా చేశారు. రూ.1.82 కోట్లతో ఢిల్లీ రెండో స్థానంలో, రూ.1.62 కోట్లతో పశ్చి మ బెంగాల్‌ మూడో స్థానంలో ఉంది. పెద్ద ఎత్తున యూపీఐ చెల్లింపులు జరుగుతున్నా.. ఏటీఎంల ద్వారా ప్రతి నెలా విత్‌డ్రా చేసే నగదు గత ఆర్థిక సంవత్సరం 5.51 శాతం పెరగడం విశేషం. పెరుగుతున్న నగదు చెల్లింపులు, పెరుగుతున్న వినియోగ ఖర్చులకు సంకేతమని నివేదిక తెలిపింది.


మెట్రోల్లో మరింత ఎక్కువ

దేశంలోని మెట్రో నగరాల్లో నగదు వినియోగం మరింత ఎక్కువగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10.37 శాతం పెరిగాయి. ఇదే సమయంలో సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌ 3.94 శాతం, సెమీ మెట్రో ప్రాంతాల్లో 3.73 శాతం మాత్రమే పెరిగాయి.

Updated Date - Apr 30 , 2024 | 06:27 AM

Advertising
Advertising