సీసీఎల్ ప్రొడక్ట్స్ రూ.2 డివిడెండ్
ABN, Publish Date - Aug 08 , 2024 | 03:58 AM
వర్తమాన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సీసీఎల్ ప్రొడక్ట్స్ స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.25.14 కోట్ల నికర లాభం నమోదు చేసింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వర్తమాన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సీసీఎల్ ప్రొడక్ట్స్ స్టాండ్ అలోన్ ప్రాతిపదికన రూ.25.14 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రూ.2.79 కోట్లు తక్కువ. గత ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చితే కంపెనీ ఆదాయం రూ.372.31 కోట్ల నుంచి రూ.434.11 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరు పై రూ.2 చొప్పున తుది డివిడెండ్‌గా చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందుకు వచ్చే నెల 13ని రికార్డు తేదీగా పరిగణించాలని డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
Updated Date - Aug 08 , 2024 | 03:58 AM