Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ABN, Publish Date - Jan 03 , 2024 | 04:39 PM
దేశంలో ఇంధన ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొత్త ఏడాదిలో ఇంధన రేట్లు తగ్గుతాయని(Fuel price cut) వచ్చిన వార్తల్లో నిజం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ(hardeep singh poori) స్పష్టం చేశారు.
దేశంలో 2023 సంవత్సరం చివరి వారంలో, కొత్త సంవత్సరంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుందని(Fuel prices cut) సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రూ.6 నుంచి 10 వరకు తగ్గించవచ్చని ప్రచారం జరిగింది. ఈ వార్తల గురించి కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ(hardeep singh poori) బుధవారం క్లారిటీ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ మేరకు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని గుర్తు చేశారు.
మరోవైపు దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 40 నుంచి 80 శాతం పెరిగాయని ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరీ గుర్తు చేశారు. ఆయా దేశాలను పరిశీలిస్తే మన దగ్గర ధరలు స్థిరంగా ఉన్నట్లు చెప్పారు. మన దేశంలో పలు కారణాల రిత్యా రెండుసార్లు నవంబర్ 2021, మే 2022లో ఇంధన ధరలు తగ్గించబడినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇంధనం, చమురు, ఎల్‌పీజీ వినియోగంలో భారత్ మూడో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ఎల్‌ఎన్‌జి దిగుమతిదారు, రిఫైనర్, ఆటోమొబైల్ మార్కెట్‌లో భారతదేశం(Bharat) ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించిందని అన్నారు. అంటే భారతదేశంలో ఇంధన అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో భారీ అస్థిరత ఉన్నందున ఇంధనంపై ధరయం తగ్గించడం కష్టమని చెప్పారు.
Updated Date - Jan 03 , 2024 | 04:40 PM