H-1B Visa : ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసాల కష్టాలు
ABN, Publish Date - Dec 14 , 2024 | 05:50 AM
భారత ఐటీ కంపెనీలు అమెరికాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దేశంలోని ఏడు అగ్రశ్రేణి ఐటీ సంస్థలకు హెచ్-1బీ వీసాల జారీని అమెరికా కఠినం చేసింది. దీంతో ఈ వీసాలపై తక్కువ జీతాలకు తమ ఉద్యోగులను అమెరికా పంపించి ప్రాజెక్టులు పూర్తి చేయడం భారత
సగానికి తగ్గిన వీసాల ఆమోదం
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలు అమెరికాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దేశంలోని ఏడు అగ్రశ్రేణి ఐటీ సంస్థలకు హెచ్-1బీ వీసాల జారీని అమెరికా కఠినం చేసింది. దీంతో ఈ వీసాలపై తక్కువ జీతాలకు తమ ఉద్యోగులను అమెరికా పంపించి ప్రాజెక్టులు పూర్తి చేయడం భారత కంపెనీలకు కష్టంగా మారింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీలకు 14,792 హెచ్-1బీ వీసాలు జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) ఇది ఏకంగా 7,299కు పడిపోయింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్‌ఎ్‌ఫఏపీ) అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం అమెరికా ఆమోదించిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో భారతీయుల వాటా కేవలం 5.2 శాతం మాత్రమే. ప్రస్తుతం మొత్తం అమెరికా ఉద్యోగుల్లో హెచ్-1బీ వీసాలపై పని చేస్తున్న భారతీయుల శాతం కేవలం 0.004 శాతం మాత్రమే. డొనాల్డ్ ట్రంప్ రెండో జమానాలో హెచ్-1బీ వీసాల జారీని కఠినం చేస్తే ఇది మరింత పడిపోతుందని భావిస్తున్నారు. దీంతో అమెరికాలో ప్రాజెక్టులు చేపడుతున్న భారత కంపెనీలు అధిక జీతాలు ఇచ్చి స్థానికుల్ని ఉద్యోగాల్లో నియమించుకోక తప్పడం లేదు. ప్రాజెక్టులు సన్నగిల్లిన తరుణంలో ఇది తమపై అదనపు భారం మోపడమేనని కంపెనీలు వాపోతున్నాయి.
Updated Date - Dec 14 , 2024 | 05:50 AM