ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చైనానే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి

ABN, Publish Date - May 13 , 2024 | 01:11 AM

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా భారత-చైనా ద్వైపాక్షిక వాణిజ్య మూడు పువ్వులు, ఆరు కాయల్లా వర్ధిల్లుతోంది. గత ఆర్థిక పసంవత్సరం (2023-24) చైనా అమెరికాను తోసిపుచ్చి.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా...

  • 2023-24లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం రూ.9.88 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా భారత-చైనా ద్వైపాక్షిక వాణిజ్య మూడు పువ్వులు, ఆరు కాయల్లా వర్ధిల్లుతోంది. గత ఆర్థిక పసంవత్సరం (2023-24) చైనా అమెరికాను తోసిపుచ్చి.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. ఈ కాలంలో రెండు దేశాల వాణిజ్యం 11,840 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.88 లక్షల కోట్లు) చేరింది. ఇదే సమయంలో 11,830 కోట్ల డాలర్లతో (సుమారు రూ.9.87 లక్షల కోట్లు) అమెరికా రెండో స్థానానికి పడిపోయింది. 2021-23 మధ్య కాలంలో అమెరికా మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా ఆక్రమించింది. గత ఆర్థిక సంవత్సరం చైనా మన దేశానికి 10,170 కోట్ల డాలర్ల (సుమారు రూ.8.49 లక్షల కోట్లు) విలువైన సరుకులు ఎగుమతి చేసి.. మన దేశం నుంచి 1,667 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.39 లక్షల కోట్లు) సరుకులను మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి చైనా ఎగుమతులు 3.24 శాతం మాత్రమే పెరిగినా.. అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఎదగడం విశేషం.

Updated Date - May 13 , 2024 | 01:11 AM

Advertising
Advertising