ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కోఫోర్జ్‌ గూటికి సిగ్నిటీ

ABN, Publish Date - May 03 , 2024 | 06:04 AM

హైదరాబాద్‌కు చెందిన ఐటీ సేవల కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్‌లో 54 శాతం వరకు వాటాను కొనుగోలు చేయనున్నట్లు నోయిడాకు చెందిన ఐటీ సంస్థ కోఫోర్జ్‌ గురువారం ప్రకటించింది...

54 శాతం వాటా కొనుగోలు.. ఒక్కో షేరుకు రూ.1,415 చెల్లింపు

జూలై-సెప్టెంబరు త్రైమాసికం నాటికి డీల్‌ పూర్తి

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఐటీ సేవల కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్‌లో 54 శాతం వరకు వాటాను కొనుగోలు చేయనున్నట్లు నోయిడాకు చెందిన ఐటీ సంస్థ కోఫోర్జ్‌ గురువారం ప్రకటించింది. ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా సిగ్నిటీకి చెందిన ఒక్కో షేరుకు రూ.1,415 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 2న బీఎ్‌సఈలో సిగ్నిటీ షేరు ముగింపు ధర రూ.1,372.65తో పోలిస్తే 3 శాతం అధికమిది. సిగ్నిటీ టెక్నాలజీ్‌సలో 54 శాతం వరకు ఈక్విటీ వాటా కొనుగోలుకు కంపెనీ ప్రమోటర్లు, ఎంపిక చేసిన వాటాదారులతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకారం లభించిందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు కోఫోర్జ్‌ వెల్లడించింది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో ఈ డీల్‌ పూర్తి కావచ్చని అంచనా. ఈ ఒప్పందం పూర్తయిన అనంతరం సెబీ నిబంధనల ప్రకారంగా సిగ్నిటీ టెక్నాలజీస్‌.. వాటాదారుల నుంచి షేర్ల కొనుగోలు కోసం కోఫోర్జ్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి ఉంటుంది. తద్వారా సిగ్నిటీలో కోఫోర్జ్‌ వాటా 80 శాతం వరకు పెరగనుంది.


రెండేళ్లలో 200 కోట్ల డాలర్ల కంపెనీ..

సిగ్నిటీ టెక్నాలజీస్‌ కొనుగోలుతో తమ కంపెనీ 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి 200 కోట్ల డాలర్ల విలువైన కంపెనీగా ఎదిగేందుకు దోహదపడుతుందని కోఫోర్జ్‌ భావిస్తోంది. అంతేకాదు, సంస్థ నిర్వహణ లాభాల మార్జిన్‌ సైతం 1.5-2 శాతం మేర మెరుగుపడవచ్చని అంచనా వేస్తోంది. అలాగే, రిటైల్‌, టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ విభాగాల్లోకి విస్తరించడంతోపాటు ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, పశ్చిమ యూఎస్‌ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఈ డీల్‌ దోహదపడనుంది.

రూ.2,100 కోట్ల సమీకరణ

కాగా కోఫోర్జ్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ కోఫోర్జ్‌ పీటీఈ లిమిటెడ్‌.. 25 కోట్ల డాలర్ల రుణాల (సుమారు రూ.2,100 కోట్లు)ను సమీకరించేందుకు గాను హాంకాంగ్‌ అండ్‌ షాంఘై బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, గిఫ్ట్‌ సిటీ బ్రాంచీతో ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్నీటీ కొనుగోలు కోసం కంపెనీ ఈ మొత్తాలను వినియోగించనుంది.

డీల్‌కు సిగ్నీటీ బోర్డు ఓకే

కోఫోర్జ్‌కు 54 శాతం వాటాలను విక్రయించేందుకు గాను గురువారం నాడు సిగ్నీటీ టెక్నాలజీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ ప్రమోటర్లు చక్కిలం వెంకట సుబ్రమణ్యం, రాజేశ్వరి చక్కిలం, చక్కిలం శ్రీకాంత్‌, పెన్నం సుధాకర్‌, సప్న పెన్నం ఈ మేరకు ఆమోదం తెలిపినట్లు బోర్డు పేర్కొంది. డీల్‌లో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 32.47 శాతం వరకు ఈక్విటీని కోఫోర్జ్‌కు విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 32.77 శాతం వరకు ఉంది. కాగా 1998 సెప్టెం బరులో కార్యకలాపాలు ప్రారంభించిన సిగ్నిటీ టెక్నాలజీస్‌.. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే), ఆస్ట్రేలియా, కెనడా, చెక్‌ రిపబ్లిక్‌, దక్షిణాఫ్రికా,సింగపూర్‌ మార్కెట్లకు డిజిటల్‌ అస్యూరెన్స్‌, ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, క్వాలిటీ ఇంజనీరింగ్‌ సేవలందిస్తోంది.


కోఫోర్జ్‌ లాభంలో 95% వృద్ధి

ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికానికి (క్యూ4) కోఫోర్జ్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 95 శాతం వృద్ధితో రూ.223.7 కోట్లకు చేరుకుంది. ఆదాయం 8.68 శాతం పెరిగి రూ.2,358.5 కోట్లుగా నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ లాభం 16.46 శాతం వృద్ధితో రూ.808 కోట్లకు, ఆదాయం 14.52 శాతం పెరుగుదలతో రూ.9,179 కోట్లకు చేరుకుంది. ఈ మార్చి 31 నాటికి కోఫోర్జ్‌ ఉద్యోగుల సంఖ్య 24,726కు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను కోఫోర్జ్‌ వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కోషేరుకు రూ.19 డివిడెండ్‌ను ప్రకటించింది.

సిగ్నిటీ లాభంలో క్షీణత

క్యూ4లో సిగ్నిటీ టెక్నాలజీస్‌ లాభం దాదాపు 45 శాతం క్షీణించి రూ.27.14 కోట్లకు పరిమితం కాగా.. విక్రయాలు మాత్రం 7.22 శాతం పెరిగి రూ.455.64 కోట్లకు చేరుకున్నా యి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం 1.62 శాతం తగ్గి రూ. 165.59 కోట్లకు చేరుకోగా, అమ్మకాలు 10.16 శాతం పెరుగుదలతో రూ. 1,815.01 కోట్లుగా నమోదయ్యాయి.

Updated Date - May 03 , 2024 | 06:04 AM

Advertising
Advertising