ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐదేళ్లలో క్రెడిట్‌ కార్డులు డబుల్‌

ABN, Publish Date - Sep 05 , 2024 | 02:56 AM

దేశంలో క్రెడిట్‌ కార్డుల వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోందని పీడబ్ల్యూసీ తాజా నివేదిక పేర్కొంది. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో క్రెడిట్‌ కార్డులు రెట్టింపయ్యాయని.. మున్ముందు సంవత్సరాల్లోనూ...

2028-29 నాటికి 20 కోట్లకు.. పీడబ్ల్యూసీ నివేదిక అంచనా

న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్‌ కార్డుల వ్యాపారం శరవేగంగా వృద్ధి చెందుతోందని పీడబ్ల్యూసీ తాజా నివేదిక పేర్కొంది. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో క్రెడిట్‌ కార్డులు రెట్టింపయ్యాయని.. మున్ముందు సంవత్సరాల్లోనూ ఇదే ట్రెండ్‌ కొననసాగనుందని ఆ నివేదిక తెలిపింది. 2028-29 నాటికి క్రెడిట్‌ కార్డులు రెట్టింపై 20 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. వచ్చే ఐదేళ్ల పాటు కార్డుల సంఖ్య 15 శాతం చొప్పున వృద్ధి చెందనుందని అంటోంది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..

  • క్రెడిట్‌ కార్డుల జారీతోపాటు ఈ కార్డుల ద్వారా ఆర్థిక లావాదేవీలూ గణనీయంగా పెరిగాయి. లావాదేవీల సంఖ్య 22 శాతం పెరగగా.. లావాదేవీల మొత్తం విలువలో 28 శాతం వృద్ధి నమోదైంది. కొత్త ఉత్పత్తుల విడుదల, వినూత్న ఆఫర్లు, కస్టమర్‌ సెగ్మెంట్ల విస్తరణ వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయని రిపోర్టు పేర్కొంది.


  • డెబిట్‌ కార్డుల వినియోగం తగ్గుముఖం పడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో డెబిట్‌ కార్డుల ద్వారా లావాదేవీలు వార్షిక ప్రాతిపదికన 33 శాతం తగ్గగా.. లావాదేవీల విలువ 18 శాతం తగ్గింది. అంతేకాదు, 2023-24లో కొత్త డెబిట్‌ కార్డుల జారీ వృద్ధి కూడా నెమ్మదించిందని.. యూపీఐ లావాదేవీలకు ప్రాచుర్యం పెరగడం ఇందుకు ఒక కారణమని రిపోర్టు తెలిపింది.

  • దేశంలో డిజిటల్‌ చెల్లింపులు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయని.. 2023-24లో ఈ లావాదేవీల సంఖ్య 42ు వృద్ధి చెందాయి. 2028-29 నాటికి ఈ ట్రెండ్‌ మూడింతలు కావచ్చని అంచనా.

Updated Date - Sep 05 , 2024 | 02:56 AM

Advertising
Advertising