సామాజిక బాధ్యతలో సీఎ్‌సలది కీలక పాత్ర
ABN, Publish Date - Oct 19 , 2024 | 06:42 AM
కంపెనీల సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్)ల నిర్వహణలో కంపెనీ సెక్రటరీ (సీఎ్‌స)లది కీలక పాత్ర అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
యువ సీఎ్‌సలు కొత్త నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలి
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కంపెనీల సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్)ల నిర్వహణలో కంపెనీ సెక్రటరీ (సీఎ్‌స)లది కీలక పాత్ర అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎ్‌సఐ) సౌత్ ఇండియా రీజినల్ చాప్టర్ నిర్వహించిన సదస్సులో ఆయన ఈ విషయం తెలిపారు. తెలివితేటలే ప్రగతికి చోదక శక్తులన్నారు. దివాలా, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్, వాల్యుయేషన్, ఫోరెన్సిక్ ఆడిట్, రిస్క్ మేనేజ్‌మెంట్లలోనూ సీఎ్‌సలది కీలక పాత్ర అన్నారు. సీఎస్ కోర్సు పూర్తి చేస్తున్న యువకులు తాజా మార్పులనూ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని గవర్నర్ కోరారు. మారిటైమ్ లా, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించి ఐసీఎ్‌సఐ ప్రత్యేక సీఎ్‌సలను తీర్చిదిద్దడంపైనా గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు.
రెండు లక్షల మంది సీఎ్‌సలు అవసరం: దేశంలో కంపెనీ సెక్రటరీల అవసరం ఏటికేటికీ పెరుగుతోందని ఐసీఎ్‌సఐ జాతీయ అధ్యక్షుడు నరసింహన్ అన్నారు. ప్రస్తుతం దేశంలో 74,000 మంది సీఎ్‌సలు ఉన్నారు. 2047 నాటికి వీరి సంఖ్య రెండు లక్షలకు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌సీఎల్‌టీ కేసులు చూసే ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీల కోసం హైదరాబాద్‌లో రూ.10 కోట్ల అంచనాతో ప్రత్యేక భవనం నిర్మించనున్నట్టు ఐసీఎ్‌సఐ హైదరాబాద్ చాప్టర్ సభ్యుడు ఆర్ వెంకటరమణ ఈ సందర్భంగా వెల్లడించారు.
Updated Date - Oct 19 , 2024 | 06:42 AM