వివోతో డిక్సన్ టెక్ జాయింట్ వెంచర్
ABN, Publish Date - Dec 16 , 2024 | 05:14 AM
స్మార్ట్ ఫోన్లు సహా ఎలక్ర్టానిక్ డివైస్‌ల తయారీ కోసం చైనా మొబైల్ కంపెనీ వివో, ఎలక్ర్టానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నాయి..
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్లు సహా ఎలక్ర్టానిక్ డివైస్‌ల తయారీ కోసం చైనా మొబైల్ కంపెనీ వివో, ఎలక్ర్టానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నాయి. రెగ్యులేటరీ సంస్థలకు పంపిన సందేశంలో ఈ విషయం వెల్లడించారు. జాయింట్ వెంచర్‌లో డిక్సన్ టెక్ 51 శాతం వాటాలు కలిగి ఉంటుంది. మిగతా వాటాలు వివో చేతిలో ఉంటాయి. ఇందుకోసం ఉభయ సంస్థలు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే డిక్సన్, వివో రెండూ ఒక కంపెనీలో మరోటి ఎలాంటి వాటా కలిగి ఉండదు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఇండియాలో వివో ఓఈఎం ఆర్డర్లను స్వీకరించడంతో పాటు ఇతర బ్రాండ్లకు చెందిన వివిధ ఎలక్ర్టానిక్ ఉత్పత్తుల ఓఈఎం కాంట్రాక్టులు కూడా చేపడుతుంది. అయితే ఈ జాయింట్ వెంచర్ ఎప్పటి నుంచి వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభిస్తుందని గాని, దీనికి సంబంధించిన ఆర్థిక వివరాలు గాని ఆ ప్రకటనలో తెలియచేయలేదు.
Updated Date - Dec 16 , 2024 | 05:14 AM