ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dr. Reddy : న్యూట్రిషన్‌, ఓటీసీ వ్యాపారం బలోపేతంపై డాక్టర్‌ రెడ్డీస్‌ ఫోకస్‌

ABN, Publish Date - Jul 07 , 2024 | 06:18 AM

డాక్టర్‌ లేబొరేటరీస్‌.. వచ్చే ఐదేళ్ల కాలంలో తన ఔషధ పోర్టుఫోలియోను మరింత పటిష్ఠం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌లో ఓవర్‌ ది కౌంటర్‌ (ఓటీసీ) వ్యాపారాన్ని బలోపేతం చేయటంతో పాటు వ్యాక్సిన్లు, కీలకమైన మాలిక్యూల్స్‌ కోసం కొత్త

వ్యాక్సిన్లు, కీలక మాలిక్యూల్స్‌

కోసం భాగస్వామ్యాలు 2023-24 వార్షిక నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): డాక్టర్‌ లేబొరేటరీస్‌.. వచ్చే ఐదేళ్ల కాలంలో తన ఔషధ పోర్టుఫోలియోను మరింత పటిష్ఠం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌లో ఓవర్‌ ది కౌంటర్‌ (ఓటీసీ) వ్యాపారాన్ని బలోపేతం చేయటంతో పాటు వ్యాక్సిన్లు, కీలకమైన మాలిక్యూల్స్‌ కోసం కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయటంపై దృష్టి పెట్టనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తన 2023-24 వార్షిక నివేదికలో వెల్లడించింది. భవిష్యత్‌ హెల్త్‌కేర్‌ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలను రూపొందించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ కే సతీష్‌ రెడ్డి, సంస్థ కో చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ వార్షిక నివేదికలో వెల్లడించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కీలకమైన మాలిక్యూల్స్‌ (ఎన్‌సీఈ, ఎన్‌బీఈ, కార్‌-టీ), డిజిటల్‌ థెరాప్యుటిక్స్‌ (వేరబుల్స్‌, యాప్స్‌), కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ (న్యూట్రిషన్‌, ఓటీసీ వెల్‌నె్‌స)పై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. భవిష్యత్‌లో కంపెనీ మరింత వృద్ధి పథంలోకి సాగటానికి ఇవి కీలకంగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నెస్లే ఇండియాతో కలిసి జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయటం కూడా ఇందులో భాగమేనని వారన్నారు. నెస్లే భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా పేరొందిన న్యూట్రిషనల్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ భాగస్వామ్యం భారత్‌లో కంపెనీ న్యూట్రిషన్‌, ఓటీసీ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేస్తుందని డాక్టర్‌ రెడ్డీస్‌ అంచనా వేస్తోంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేయటంతో పాటు కొత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో కంపెనీ పోర్టుఫోలియోను పటిష్ఠం చేసుకోవాలని భావిస్తోంది.

ఐదేళ్లలో 150 కోట్ల మంది రోగులకు దరి చేరేలా: 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 150 కోట్ల మంది రోగులకు తమ ఔషధాలు దరి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. ప్రస్తుతం 70.4 కోట్ల మంది రోగులకు కంపెనీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కాగా కంపెనీ కీలక వ్యాపారాలైన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ), జెనరిక్స్‌, బ్రాండెడ్‌ జెనరిక్స్‌, బయోసిమిలర్స్‌ విభాగాలను మరింత పటిష్టం చేయనున్నట్లు పేర్కొంది.

త్వరలో యూఎస్‌ మార్కెట్లోకి రిటుక్సిమాబ్‌ బయోసిమిలర్‌: రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌, ప్రాణాంతక లింఫోసైటిక్‌ లుకేమియా వ్యాధి చికిత్సలో వినియోగించే రిటుక్సిమాబ్‌ బయోసిమిలర్‌ను అమెరికా మార్కెట్లోకి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. ఈ ఔషధానికి సంబంధించి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ ఎఫ్‌డీఏ) నుంచి కంప్లీట్‌ రెస్పాన్స్‌ లెటర్‌ అందుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఎఫ్‌డీఏ లేవనెత్తిన అన్ని అంశాలను నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయనున్నట్లు పేర్కొంది.

అంకాలజీ పోర్టుఫోలియోపై దృష్టి: వర్ధమాన దేశాల మార్కెట్లో మరింతగా పట్టును చేజిక్కించుకునే ఉద్దేశంతో అంకాలజీ, బయోసిమిలర్స్‌ విభాగంలో కొత్త ఔషధాలను విడుదల చేయటంతో పాటు ప్రస్తుత ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిని కేంద్రీకరించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. ఇందులో భాగంగానే క్యాన్సర్‌ ఔషధం టోరిపాలిమాబ్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఇక్కడి నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే రష్యా, చైనా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించటంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది.

Updated Date - Jul 07 , 2024 | 06:18 AM

Advertising
Advertising
<