లీడ్ గ్రూప్ నుంచి టెక్‌బుక్
ABN, Publish Date - Nov 08 , 2024 | 06:29 AM
ఎడ్‌టెక్ సంస్థ లీడ్ గ్రూప్.. టెక్‌బుక్ పేరుతో ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్‌ను తీసుకువచ్చింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఎడ్‌టెక్ సంస్థ లీడ్ గ్రూప్.. టెక్‌బుక్ పేరుతో ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్‌ను తీసుకువచ్చింది. సాంప్రదాయ పాఠ్యపుస్తకాలను పూర్తిగా ఇంటలిజెంట్ పుస్తక రూపంలో టెక్‌బుక్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు సుమిత్ మెహతా తెలిపారు. మూడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలు.. అగ్‌మెంటెడ్ రియాల్టీ, పర్సనలైజ్డ్ రీడింగ్ ఫ్లూయెన్సీ, పర్సనలైజ్డ్ ప్రాక్టీస్ పేరుతో దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. 3డీ విధానంలో విద్యార్ధులు సులభంగా పాఠాలను అర్ధం చేసుకోవచ్చన్నారు. యాప్ ద్వారా పాఠాన్ని స్కాన్ చేయటం ద్వారా విద్యార్ధులు పాఠాలను అభ్యసించవచ్చని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ఈ టెక్‌బుక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వందకు పైగా పాఠశాలల్లో టెక్‌బుక్ టూల్‌ను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సుమిత్ చెప్పారు.
Updated Date - Nov 08 , 2024 | 06:29 AM