ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పసిడి రుణాలకూ ఈఎంఐ!

ABN, Publish Date - Nov 20 , 2024 | 03:07 AM

బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలను నెలవారీ వాయిదా (ఈఎంఐ)ల్లో చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. ఈ రుణాలు తీసుకోవాలంటే బ్యాంకుల నుంచి...

నెలవారీ వాయిదాల్లో అసలు, వడ్డీ చెల్లించే వెసులుబాటు..

త్వరలో ప్రవేశపెట్టేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల సన్నాహాలు

న్యూఢిల్లీ: బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలను నెలవారీ వాయిదా (ఈఎంఐ)ల్లో చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. ఈ రుణాలు తీసుకోవాలంటే బ్యాంకుల నుంచి సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాదు, క్రెడిట్‌ స్కోర్‌, నెలవారీ ఆదాయం ఇతరత్రా అన్నింటిని పరిశీలించిన తర్వాతే అవి రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే ఇలాంటి చిక్కులు లేకుండా మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను నెలవారీ వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎ్‌ఫసీ) సన్నాహాలు చేస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలకు వడ్డీని మాత్రం నెలనెలా చెల్లిస్తే సరిపోతుంది. అది కూడా తప్పనిసరేం కాదు. రుణ కాలపరిమితి ముగిసే నాటికి అసలు, వడ్డీని ఒకేసారి చెల్లించి కూడా తనఖా బంగారాన్ని విడిపించుకోవచ్చు. కానీ, కొందరు రుణగ్రహీతలు తీసుకున్న అప్పును మొత్తం ఒకేసారి చెల్లించడం భారమై తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేని పరిస్థితి.


ఈ రుణాన్ని ఒకేసారి తీర్చలేని వారికి ఈ విధానం మేలు చేస్తుందని బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే గృహ, వాహన, వ్యక్తిగత రుణాల్లాగే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పును కూడా అసలు, వడ్డీ కలిపి నెలవారీ వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు యోచిస్తున్నాయి. అలాగే, బంగారం తాకట్టుపై టర్మ్‌ లోన్‌ మంజూరు ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది.

ఆర్‌బీఐ ఆందోళన నేపథ్యంలోనే..

పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు అనుసరిస్తున్న అనుచిత విధానాలపై ఈ ఏడాది సెప్టెంబరు 30న భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాల సోర్సింగ్‌, తాకట్టు బంగారం విలువ మదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్‌ టు వాల్యూ (ఎల్‌టీవీ) రేషియో, రిస్క్‌ వెయిటేజీ అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. అంతేకాదు, రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిశీలించాలని రుణదాతలను ఆర్‌బీఐ ఆదేశించింది. పాక్షిక చెల్లింపులపై రుణ కాలపరిమితి రెన్యువల్‌నూ ఆర్‌బీఐ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే తాము బంగారం తనఖా రుణాలకూ నిర్దేశిత గడువుతో కూడిన ఈఎంఐ ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నామని సీనియర్‌ బ్యాంకింగ్‌ అధికారి పేర్కొన్నారు.


రూ.1.4 లక్షల కోట్ల రుణాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం నాటికి బ్యాంకుల బంగారం తనఖా రుణాల మంజూరు వార్షిక ప్రాతిపదికన 51 శాతం వృద్ధితో రూ.1.4 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాదిలో ఇదే కాలానికి ఈ రుణాల వృద్ధి 14.6 శాతంగా నమోదైంది. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధర భారీగా పెరగడంతో ఈ విభాగ రుణాలకూ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ నివేదిక ప్రకారం.. ఈ ఏప్రిల్‌-ఆగస్టు మధ్యకాలంలో బ్యాంకుల బంగారం రుణాల మంజూరు 37 శాతం వృద్ధి చెందగా.. గోల్డ్‌ లోన్‌ కంపెనీల రుణ ఆస్తులు 11 శాతం పెరిగాయి.

Updated Date - Nov 20 , 2024 | 03:08 AM