ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌లోకి బీఎస్‌ఏ ఎంట్రీ

ABN, Publish Date - Aug 16 , 2024 | 01:39 AM

ప్రపంచంలోనే అత్యంత పురాతన మోటార్‌ సైకిళ్ల బ్రాండ్‌ ‘బర్మింగ్‌హామ్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ కంపెనీ’ (బీఎ్‌సఏ) తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం మహీంద్రా గ్రూప్‌ చేతుల్లో ఉన్న ఈ కంపెనీ.. గోల్డ్‌ స్టార్‌ 650 మోటార్‌ సైకిల్‌ను...

గోల్డ్‌ స్టార్‌ 650 విడుదల ధర రూ.2.99 లక్షలు

ముంబై: ప్రపంచంలోనే అత్యంత పురాతన మోటార్‌ సైకిళ్ల బ్రాండ్‌ ‘బర్మింగ్‌హామ్‌ స్మాల్‌ ఆర్మ్స్‌ కంపెనీ’ (బీఎ్‌సఏ) తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం మహీంద్రా గ్రూప్‌ చేతుల్లో ఉన్న ఈ కంపెనీ.. గోల్డ్‌ స్టార్‌ 650 మోటార్‌ సైకిల్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.2.99 లక్షలు. జావా, యెజ్డీ బైక్‌లను విక్రయిస్తున్న మహీంద్రా గ్రూప్‌ ప్రీమియం మోటార్‌ సైకిళ్ల విభాగం క్లాసిక్‌ లెజెండ్స్‌ను 2016లో బీఎ్‌సఏను కొనుగోలు చేసింది. 2021లో యూకే మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన బీఎ్‌సఏ గోల్డ్‌ స్టార్‌ 650 బైక్‌ ప్రస్తుతం యూరప్‌, టర్కీ, న్యూజీలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో అమ్ముడవుతోంది. తాజాగా భారత్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ 650కి పోటీగా మహీంద్రా ఈ బైక్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్ల వద్ద ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తెలిపారు.

Updated Date - Aug 16 , 2024 | 01:39 AM

Advertising
Advertising
<