ఎలక్ట్రిక్ ఎల్‌సీవీ విభాగంలోకి యూలర్
ABN, Publish Date - Sep 26 , 2024 | 12:43 AM
ఎలక్ట్రిక్ వాహన తయారీదారు యూలర్ మోటార్స్.. తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్‌సీవీ) విభాగంలోకి ప్రవేశించింది. వివిధ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా నాలుగు టైర్లతో కూడిన రెండు ఎలక్ట్రిక్ ఎల్‌సీవీలను...
రెండు మోడల్స్ విడుదల
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీదారు యూలర్ మోటార్స్.. తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్‌సీవీ) విభాగంలోకి ప్రవేశించింది. వివిధ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా నాలుగు టైర్లతో కూడిన రెండు ఎలక్ట్రిక్ ఎల్‌సీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలను విక్రయిస్తోందని, తాజాగా ఇంటర్, ఇంట్రా సిటీ అవసరాల కోసం స్టార్మ్ పేరుతో ఈ వాహనాలను తీసుకువచ్చినట్లు యూలర్ మోటార్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ సౌరవ్ కుమార్ తెలిపారు. ఇంట్రా సిటీ కోసం స్టార్మ్ ఈవీ టీ1250 పేరుతో తీసుకువచ్చిన ఎల్‌సీవీ ధర రూ.8.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్). 1,250 కేజీల పేలోడ్ సామర్థ్యంతో కూడిన ఈ వాహనం ఒకసారి చార్జింగ్‌తో 140 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఇంటర్ సిటీ కోసం తీసుకువచ్చిన స్టార్మ్ ఈవీ లాంగ్‌రేంజ్ 200 ధర రూ.12.99 (ఎక్స్‌షోరూమ్) అని ఆయన పేర్కొన్నారు.
ఈ వాహనం 1,250 కేజీల పేలోడ్ సామర్థ్యంతో పాటు సింగిల్ చార్జింగ్‌తో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ వాహనాలను తొలుత హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
Updated Date - Sep 26 , 2024 | 12:43 AM