ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ, తెలంగాణల్లో గోద్రెజ్‌ క్యాపిటల్‌ విస్తరణ

ABN, Publish Date - Oct 19 , 2024 | 06:39 AM

ఎస్‌ఎంఈ, ఎంఎ్‌సఎంఈ విభాగాలకు అవసరమైన రుణాలను అందిస్తున్న గోద్రెజ్‌ క్యాపిటల్‌..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎస్‌ఎంఈ, ఎంఎ్‌సఎంఈ విభాగాలకు అవసరమైన రుణాలను అందిస్తున్న గోద్రెజ్‌ క్యాపిటల్‌.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దక్షిణాదిలో రెండు తెలుగు రాష్ట్రాలు కంపెనీకి ఎంతో కీలకంగా ఉన్నాయని, కార్యకలాపాల విస్తరణ ద్వారా మరింత పట్టును చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు గోద్రెజ్‌ క్యాపిటల్‌ ఎండీ,సీఈఓ మనీష్‌ షా తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోని ఐదు నగరాల్లో 6 శాఖల ద్వారా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోందని, విస్తరణలో భాగం గా ఈ ఏడాది కొత్తగా మరో 10 శాఖలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాగా ఏపీ, తెలంగాణల్లో కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.500 కోట్లుగా ఉందని, వచ్చే ఏడాది మార్చి నాటికి దీన్ని రూ.800 కోట్లకు పెంచుకోవాలని చూస్తున్నట్లు షా తెలిపారు. ఎంఎ్‌సఎంఈ, ఎస్‌ఎంఈ రంగంలోని కంపెనీలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద సెక్యూర్డ్‌, అన్‌ సెక్యూర్డ్‌ రుణాలను గోద్రెజ్‌ క్యాపిటల్‌ అందిస్తోంది. కాగా సప్లయ్‌-చెయిన్‌ రంగాలకు ఫైనాన్సింగ్‌ సేవలను విస్తరించామని, ఇందులో భాగంగా క్రీమ్‌లైన్‌ డెయిరీతో కలిసి డెయిరీ ఫార్మ్‌ లోన్‌ను ప్రారంభించినట్లు షా చెప్పారు. అలాగే వచ్చే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని గృహ రుణ విభాగంలోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఏయూఎం రూ.13,600 కోట్లుగా ఉందని, మార్చి నాటికి దీన్ని రూ.17,000 కోట్లకు పెంచుకోవాలని చూస్తున్నట్లు షా చెప్పారు.

Updated Date - Oct 19 , 2024 | 06:39 AM