ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గ్రామ స్థాయికి బీమా సేవల విస్తరణ

ABN, Publish Date - May 12 , 2024 | 03:10 AM

గ్రామీణ స్థాయికి జీవిత, ఆరోగ్య, ధర్డ్‌ పార్టీ మోటార్‌ బీమా సేవలను విస్తరింపజేసేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలో ఎంపిక చేసిన కొన్ని గ్రామ పంచాయితీలకు...

గ్రామ స్థాయికి బీమా సేవల విస్తరణ చర్యలకు శ్రీకారం చుట్టిన ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: గ్రామీణ స్థాయికి జీవిత, ఆరోగ్య, ధర్డ్‌ పార్టీ మోటార్‌ బీమా సేవలను విస్తరింపజేసేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశంలో ఎంపిక చేసిన కొన్ని గ్రామ పంచాయితీలకు బీమా సేవలను విస్తరించాలని జీవిత, సాధారణ బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. పంచాయతీ రాజ్‌ శాఖతో సంప్రదించిన అనంతరం నియంత్రణ మండలి జారీ చేసిన మాస్టర్‌ సర్క్యులర్‌ ప్రకారం.. ప్రతి జీవిత లేదా సాధారణ బీమా సంస్థ మార్కెట్‌ వాటా లేదా ఇతర ప్రమాణాల ప్రకారంగా కనీసం ఎన్ని గ్రామాలకు తన సేవలను విస్తరించాల్సి ఉంటుందనే అంశాన్ని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌లు నిర్ణయించనున్నాయి. ఆ తర్వాత నిర్దేశిత సంఖ్య మేరకు ఏయే రాష్ట్రాల్లోని గ్రామాల్లో తన సేవలను విస్తరించాలనుకునే అంశాన్ని మాత్రం బీమా సంస్థకే వదిలేయనునున్నాయి.


అమలు తీరు ఇలా..

ఎంపిక చేసుకున్న గ్రామ పంచాయతీలో ఎంత మంది వ్యక్తులు/జీవులు/వాహనాలకు బీమా కవరేజీ కల్పించామనే విషయాన్ని రికార్డు చేసి, సమాచారాన్ని పంచుకునేందుకు ప్రతి జీవిత, సాధారణ బీమా సంస్థ ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేసుకోనుంది. గ్రామంలోని అందరు వ్యక్తులు, అన్ని వాహనాలకు బీమా కవరేజీ కల్పించే లక్ష్యంతో సదరు బీమా సంస్థ యంత్రాంగం ఆ గ్రామ సర్పంచ్‌ లేదా గ్రామ సచివాలయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని బీమా నియంత్రణ మండలి పేర్కొంది. కొత్త నిబంధనలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే వర్తించనున్నాయి. 2047 నాటికి దేశ ప్రజలందరినీ బీమా సేవల పరిధిలోకి తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - May 12 , 2024 | 03:10 AM

Advertising
Advertising