రూ.21 లక్షల కోట్లకు..
ABN, Publish Date - Dec 05 , 2024 | 05:24 AM
దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వె్‌స్టమెంట్స్ ట్రస్ట్స్ (రీట్స్)కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని....
2030 నాటికి ఇన్విట్స్ ఏయూఎం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వె్‌స్టమెంట్స్ ట్రస్ట్స్ (రీట్స్)కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ఇండియన్ ఇన్విట్స్ అసోసియేషన్, భారత్ ఇన్విట్స్ అసోసియేషన్ వెల్లడించాయి. బుధవారం నాడిక్కడ ఈ సంస్థలు రీట్స్, ఇన్విట్స్‌పై రిటైల్ మదుపరులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సీఎ్‌ఫఓ ప్రీతి చద్దా, హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీట్స్ సీఎ్‌ఫఓ అభిషేక్ చాజర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇన్విట్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.5 లక్షల కోట్లుగా ఉండగా మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లుగా ఉందన్నారు. భారత ప్రభుత్వం చేపడుతున్న నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, జాతీయ మానిటైజేషన్ ప్రణాళికతో ఇన్విట్స్‌కు మరింతగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దీంతో 2030 నాటికల్లా ఇన్విట్స్ ఏయూఎం 21 లక్షల కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా రీట్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.1.5 లక్షల కోట్లుగా ఉండగా మార్కెట్ క్యాప్ రూ.95,000 కోట్లుగా ఉంది. ప్రస్తుతం వీటి చేతిలో 100 మిలియన్ చదరపు అడుగుల (ఎంఎ్‌సఎఫ్) ఉండగా రానున్న కొన్నేళ్లలో ఇది 400 ఎంఎ్‌సఎఫ్ చేరుకోనుందని తెలిపారు.
Updated Date - Dec 05 , 2024 | 05:24 AM