ఏఎం గ్రీన్‌తో గెయిల్ జట్టు
ABN, Publish Date - Oct 05 , 2024 | 02:56 AM
పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ రంగంలోని గెయిల్ (ఇండియా)తో ప్రైవేట్ రంగానికి చెందిన ‘ఏఎం గ్రీన్ బీవీ’ కంపెనీతో చేతులు కలిపింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ రంగంలోని గెయిల్ (ఇండియా)తో ప్రైవేట్ రంగానికి చెందిన ‘ఏఎం గ్రీన్ బీవీ’ కంపెనీతో చేతులు కలిపింది. దీనికి సంబంధించి రెండు కంపెనీల మధ్య ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓ యూ) కుదిరింది. ఈ ఎంఓయూ ద్వారా రెండు కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 2,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాయి. అలాగే ఏఎం గ్రీన్ ఏర్పాటు చేస్తున్న ఈ-మెథనాల్ ప్రాజెక్టులో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టే అవకాశాలను గెయిల్ పరిశీలిస్తుంది.
Updated Date - Oct 05 , 2024 | 02:56 AM