ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్‌

ABN, Publish Date - Oct 05 , 2024 | 03:00 AM

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. భారత మార్కెట్లోకి లగ్జరీ స్పోర్ట్స్‌ కారు ఎం4 సీఎస్‌ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.89 కోట్లు.

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. భారత మార్కెట్లోకి లగ్జరీ స్పోర్ట్స్‌ కారు ఎం4 సీఎస్‌ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.89 కోట్లు. ఈ ఏడాది బీఎండబ్ల్యూ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన 25వ మోడల్‌ ఇది. కాగా భారత మార్కెట్లో ఈ కారు పూర్తిగా కంప్లీట్లీ బిల్టప్‌ యూనిట్‌ (సీబీయూ)గా అందుబాటులో ఉంటుందని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ విక్రమ్‌ పవాహ్‌ తెలిపారు.

3.0 లీటర్‌ ట్విన్‌ టర్బోచార్జ్‌డ్‌ ఇన్‌లైన్‌ 6- సిలిండర్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు 3.4 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని బీఎండబ్ల్యూ వెల్లడించింది. కాగా ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు కాలంలో బీఎండబ్ల్యూ, మినీ కార్ల విక్రయాలు 10 శాతం వృద్ధితో 10,556 యూనిట్లకు చేరుకున్నట్లు విక్రమ్‌ తెలిపారు. కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ స్థాయి లో విక్రయాలు చేపట్టడం ఇదే తొలిసారని విక్రమ్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 03:00 AM