Gold and Silver Rates: ఈరోజు బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే
ABN, Publish Date - Mar 30 , 2024 | 08:19 AM
మార్చి 30, 2024న దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్పల్ప మార్పులు కనిపించాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోల్చితే బంగారం ధర 100 గ్రాములకు 100 రూపాయలు మాత్రమే పెరిగింది. ఈ క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.68,740 ఉండగా, ఇది నిన్న రూ.68,730గా ఉంది.
మార్చి 30, 2024న దేశవ్యాప్తంగా బంగారం(Gold), వెండి(Silver) ధరల్లో స్పల్ప మార్పులు కనిపించాయి. ఈ నేపథ్యంలో నిన్నటితో పోల్చితే బంగారం ధర 100 గ్రాములకు 100 రూపాయలు మాత్రమే పెరిగింది. ఈ క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.68,740 ఉండగా, ఇది నిన్న రూ.68,730గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,010 కాగా, ఇది నిన్న రూ.63,000గా ఉంది. అయితే 22 క్యారెట్ల పుత్తడి రేట్లు మొదటిసారిగా 63 వేల రూపాయలు దాటడం విశేషం. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,010, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,740
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,010, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,740
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,160, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,890
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,910, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.69,720
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,010, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,740
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.63,010, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.68,740
మరోవైపు ఇదే సమయంలో ఈరోజు కిలో వెండి 200 రూపాయలు పెరిగి రూ.78,000కు చేరుకుంది. ఇంతకు ముందు నిన్న వెండి కిలో ధర రూ.77,800గా ఉండేది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: నేడు LSG Vs PBKS మ్యాచ్.. లక్నో బోణీ కొట్టేనా? ప్రిడిక్షన్ ఎలా ఉదంటే
Updated Date - Mar 30 , 2024 | 09:56 AM