Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..
ABN, First Publish Date - 2024-02-10T06:54:44+05:30
బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే నిజంగా షాకవుతారు. గత మూడు రోజులుగా ఇదే తంతు. బులియన్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం కానీ ఈ స్థాయిలో హెచ్చుతగ్గులంటే కాస్త షాక్ కలిగించే విషయమే.
Gold and Silver Price: బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే నిజంగా షాకవుతారు. గత మూడు రోజులుగా ఇదే తంతు. బులియన్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం కానీ ఈ స్థాయిలో హెచ్చుతగ్గులంటే కాస్త షాక్ కలిగించే విషయమే. మూడు రోజులుగా బంగారం ధరలు ఆసక్తికరంగా.. రూ.10 పెరగడమో లేదంటే రూ.10 తగ్గడమో జరుగుతోంది. ఈ స్థాయిలో పెరిగితే కొనుగోలుదారులకు అసలు ఇబ్బంది అనిపించదు. తగ్గినా కూడా తగ్గినట్టుగా కూడా తెలియదు.
ఇక తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,890కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.63,150కి చేరింది. ఇక వెండి ధర విషయానికి వస్తే అది కూడా పరిగణలోకి తీసుకోలేనంతగా పెరిగింది. కిలో వెండి ధరపై రూ.100 మేర పెరిగి రూ.75.100కి చేరుకుంది. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం కిలో వెండి ధర రూ.76,600గా ఉంది.
Updated Date - 2024-02-10T06:54:47+05:30 IST