Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర
ABN, Publish Date - May 10 , 2024 | 06:28 AM
అక్షయ తృతీయ(మే 10)(Akshaya Tritiya) సందర్భంగా ఈరోజు గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన ధోరణి కారణంగా దేశీయ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలు క్షీణించాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు 350 రూపాయలకు పైగా తగ్గింది.
అక్షయ తృతీయ(మే 10)(Akshaya Tritiya) సందర్భంగా ఈరోజు గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన ధోరణి కారణంగా దేశీయ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలు క్షీణించాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు 350 రూపాయలకు పైగా తగ్గింది. ఈ క్రమంలో నేడు ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,290కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,150గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140కి చేరింది.
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు
ఢిల్లీలో బంగారం ధర రూ. 72,300, ధర రూ. 66,290
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 72,150, ధర రూ. 66,140
విజయవాడలో బంగారం ధర రూ. 72,150, ధర రూ. 66,140
చెన్నైలో బంగారం ధర రూ. 72,150, ధర రూ. 66,140
ముంబైలో బంగారం ధర రూ. 72,150, ధర రూ. 66,140
కోల్‌కతాలో బంగారం రూ. 72,150, ధర రూ. 66,140
వెండి ఎంత?
ఇక వెండి(silver) రేట్ల విషయానికి వస్తే ఇది కిలో రూ.200 పెరిగి రూ.85,300కి చేరింది. క్రితం ట్రేడింగ్ సెషన్ లో కిలో వెండి ధర రూ.85,100 వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ.85,300గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 88,800, ముంబైలో రూ. 85,300, బెంగళూరులో రూ. 85,300, కోల్‌కతాలో రూ.85,300, చైన్నైలో రూ.88,800గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.
ఇది కూడా చదవండి:
Two Pan Cards: ఒకే వ్యక్తి 2 పాన్ కార్డులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఏమవుతుంది?
పసిడి రుణాలపై నగదు రూ.20,000 మించొద్దు: ఆర్‌బీఐ
Read Latest Business News and Telugu News
Updated Date - May 10 , 2024 | 06:32 AM