Gold and Silver Rates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి.. ఎంతకు చేరాయంటే
ABN, Publish Date - May 27 , 2024 | 06:17 AM
అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్ట్యా బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ తగ్గాయి. ఈ క్రమంలో సోమవారం(మే 27న) దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.10 రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు ఉదయం 6.10 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,580గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల దృష్ట్యా బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ తగ్గాయి. ఈ క్రమంలో సోమవారం(మే 27న) దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా 10 రూపాయలు తగ్గింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు ఉదయం 6.10 గంటల నాటికి 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,580గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,540కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,430గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,390కి చేరింది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు
ఇక వెండి ధరల గురించి మాట్లాడితే 100 రూపాయలు తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ.91,400. కాగా నిన్న ఈ ధర కిలో రూ.91,500గా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.91,400, హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 91,900, ముంబైలో రూ. 91,400, బెంగళూరులో రూ.91,900, కోల్‌కతాలో రూ.91,400, చైన్నైలో రూ.95,900గా కలవు
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది
ఇది కూడా చదవండి:
Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News
Updated Date - May 27 , 2024 | 06:20 AM