Gold and Silver Rates: మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే
ABN, Publish Date - May 30 , 2024 | 06:33 AM
గత కొద్ది రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు నిరంతరంగా హెచ్చుతగ్గులకు లోనవుతుండగా వినియోగదారులకు మరోసారి షాకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి.
గత కొద్ది రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు నిరంతరంగా హెచ్చుతగ్గులకు లోనవుతుండగా వినియోగదారులకు మరోసారి షాకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో మీరు గురువారం అంటే మే 30న పుత్తడి, వెండి షాపింగ్ కోసం వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఈ ధరలను తెలుసుకుని వెళ్లండి.
ఈ నేపథ్యంలో ఉదయం 6.30 గంటల నాటికి ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పెరిగి రూ. 67,260కి చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా 420 రూపాయలు పెరిగి రూ.73,360కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,210గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,110కి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పుత్తడి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు)
హైదరాబాద్: రూ. 67,110
విజయవాడ: రూ. 67,110
ఢిల్లీ: రూ. 67,260
బెంగళూరు: రూ. 67,110
చెన్నై: రూ.67,760
ముంబై: రూ. 67,110
కోల్‌కతా: రూ. 67,110
అహ్మదాబాద్: రూ.67,160
ఇక వెండి ధరల విషయానికి వస్తే నేడు ఏకంగా 1200 రూపాయలు పెరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 97,800, ముంబైలో కేజీ వెండి ధర రూ. 97,800, హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 1,02,300, కేరళలో కేజీ వెండి ధర రూ. 1,02,300, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 97,800, చైన్నైలో కిలో వెండి ధర రూ. 102300గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News
Updated Date - May 30 , 2024 | 06:37 AM