Gold and Silver Rate: తగ్గిన గోల్డ్ ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన గోల్డ్, భారీగా తగ్గిన వెండి
ABN, Publish Date - Jun 12 , 2024 | 06:31 AM
దేశంలో గత మూడు రోజులుగా తగ్గిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 12న) ఉదయం 6.15 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.71,850కి చేరుకుంది. మరోవైపు వెండి రేట్లు కూడా భారీగా తగ్గాయి.
దేశంలో గత మూడు రోజులుగా తగ్గిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 12న) ఉదయం 6.15 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.71,850కి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,000గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,010కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 71,850కి చేరగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,860కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనుకూల ధోరణులు సహా పలు అంశాల కారణంతో పుత్తడి రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 71,850
విజయవాడలో రూ. 71,850
ఢిల్లీలో రూ. 72,000
ముంబైలో రూ. 71,850
చెన్నైలో రూ. 72,500
కోల్‌కతాలో రూ. 71,850
బెంగళూరులో రూ. 71,850
వడోదరలో రూ. 71,900
వెండి రేటు ఎంత
మరోవైపు ఇదే సమయంలో వెండి(silver) రేట్లు మాత్రం తగ్గాయి. ఈ నేపథ్యంలో కిలో వెండి ధర రూ.1,400 తగ్గి రూ.90,700కి చేరుకుంది. ఈ క్రమంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 90,400, హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 94,900, ముంబైలో కిలో వెండి ధర రూ. 90,400, చైన్నైలో కిలో వెండి ధర రూ. 94,900, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 90,400, కేరళలో కిలో వెండి ధర రూ. 94,900, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 90,150కి చేరుకుంది.
గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.
ఇది కూడా చదవండి:
ఎంఎ్‌సఎంఈలకు 45 నిమిషాల్లో రుణం
పత్రాల కోసం క్లెయిమ్‌ను తిరస్కరించొద్దు..
For Latest News and Business News click here
Updated Date - Jun 12 , 2024 | 06:35 AM