Gold and Silver Rate: గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN, Publish Date - Jun 14 , 2024 | 06:29 AM
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో నేడు (జూన్ 14న) దేశంలో మళ్లీ బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి రూ.72,150కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.72,200 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ధోరణులు సహా పలు అంశాల నేపథ్యంలో నేడు (జూన్ 14న) దేశంలో మళ్లీ బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి రూ.72,150కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.72,200 వద్ద ముగిసింది. మరోవైపు వెండి ధర కూడా కిలో రూ.550 తగ్గి రూ.90,950కి చేరుకుంది. గత సెషన్‌లో కిలో రూ.91,500గా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 72,150కి చేరుకోగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,140కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల బంగారం, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 72,300
హైదరాబాద్‌లో రూ. 72,150
విజయవాడలో రూ. 72,150
ముంబైలో రూ. 72,150
చెన్నైలో రూ. 72,650
కోల్‌కతాలో రూ. 72,150
బెంగళూరులో రూ. 72,150
వడోదరలో రూ. 72,200
కేరళలో రూ. 72,150
పూణేలో రూ. 72,150
మీరు మార్కెట్ నుంచి కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛత దాని క్యారెట్ ద్వారా నిర్ణయించబడుతుంది. సాధారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. కానీ ఈ బంగారంతో ఆభరణాలు తయారు చేయడం కుదరదు. అందువల్ల ఆభరణాల తయారీలో ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. ఏ క్యారెట్ బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఇక్కడ చూద్దాం.
బంగారం స్వచ్ఛతను ఇలా సూచిస్తారు
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది
23 క్యారెట్ల బంగారం 95.8 శాతం స్వచ్ఛమైనది
22 క్యారెట్ల బంగారం 91.6 శాతం స్వచ్ఛమైనది
21 క్యారెట్ల బంగారం 87.5 శాతం స్వచ్ఛమైనది
18 క్యారెట్ల బంగారం 75 శాతం స్వచ్ఛమైనది
ప్రధాన ప్రాంతాల్లో వెండి ధరలు (కిలోకు)
బెంగళూరులో రూ. 90,400
ఢిల్లీలో రూ. 90,600
హైదరాబాద్‌లో రూ. 95,100
విజయవాడలో రూ. 95,100
చెన్నైలో రూ. 95,100
కేరళలో రూ. 95,100
పూణేలో రూ. 90,600
వడోదరలో రూ. 90,600
సేలంలో రూ. 95,100
గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.
ఇది కూడా చదవండి:
శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లోకి జియో
For Latest News and Business News click here
Updated Date - Jun 14 , 2024 | 06:33 AM