Gold and Silver Rates Today: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ABN, Publish Date - Nov 20 , 2024 | 06:31 AM
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మళ్లీ షాక్ ఎదురైందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ఈ రేట్లు, ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే వివరాలను ఇక్కడ చుద్దాం.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ప్రజలు బంగారాన్ని (gold) కొనుగోలు చేస్తున్నారు. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ ముందు భారీగా పెరిగిన ఈ ధరలు తర్వాత తగ్గుముఖం పట్టాయి. కానీ నిన్నటి నుంచి మాత్రం వీటి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ సంఘటనలు, ఆర్థిక పరిస్థితులు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు (బుధవారం) ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 పెరిగి రూ.77,080కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కిలోకు
నేటి బంగారం ధరలు
ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,230కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 70,810కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 77,080కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,660కి చేరుకుంది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా కిలోకు రూ. 2,200 పెరగడం విశేషం. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
ముంబైలో రూ. 77,080, రూ. 70,660
ఢిల్లీలో రూ. 77,230, రూ. 70,810
హైదరాబాద్‌లో రూ. 77,080, రూ. 70,660
విజయవాడలో రూ. 77,080, రూ. 70,660
వడోదరలో రూ. 77,130, రూ. 70,710
కోల్‌కతాలో రూ. 77,080, రూ. 70,660
చెన్నైలో రూ. 77,080, రూ. 70,660
బెంగళూరులో రూ. 77,080, రూ. 70,660
పూణేలో రూ. 77,080, రూ. 70,660
కేరళలో రూ. 77,080, రూ. 70,660
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 91,600
ముంబైలో రూ. 91,600
హైదరాబాద్‌లో రూ. 101,100
సూరత్‌లో రూ. 91,600
తిరుపతిలో రూ. 101,100
విజయవాడలో రూ. 101,100
వడోదరలో రూ. 91,600
పాట్నాలో రూ. 91,600
అహ్మదాబాద్‌లో రూ. 91,600
కేరళలో రూ. 101,100
చెన్నైలో రూ. 101,100
కోల్‌కతాలో రూ. 91,600
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Viral News: మీటింగ్‌కు రాలేదని 90% ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. నెటిజన్ల కామెంట్స్
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 20 , 2024 | 06:42 AM